ఈ టైం లో ఇలాంటి రిస్క్ అవసరమా..?

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్( NTR ) బుల్లితెర మీదకు రాబోతున్నారు.స్మాల్ స్క్రీన్ పై హోస్ట్ గా ఇప్పటికే రెండు సార్లు కనిపించిన తారక్ మరోసారి వారిని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

 Ntr Risk With Talk Shot For Ott Details, Etv, Etv Win, Ntr, Tarak, Tollywood, Nt-TeluguStop.com

ఎన్.టి.ఆర్ హోస్ట్ గా ఈటీవీ ( ETV ) వారు ఒక సరికొత్త టాక్ షో ప్లాన్ చేస్తున్నారట.ఇది ఈటీవీ విన్( ETV Win ) ఓటీటీ లో వస్తుందని తెలుస్తుంది.

దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కు తారక్ సైన్ చేసినట్టు తెలుస్తుంది.రామోజీ రావుతో మొదటి సినిమాతోనే పనిచేశారు ఎన్.టి.ఆర్.ఇప్పుడు ఎన్.టి.ఆర్ హోస్ట్ గా పెట్టి ఒక షో ప్లాన్ చేస్తున్నారు.

హోస్ట్ గా తారక్ అనగానే అందరికీ బిగ్ బాస్ గుర్తుకొస్తుంది.బిగ్ బాస్ సీజన్ 1 మొదలు పెట్టింది ఎన్.టి.ఆర్.ఆ తర్వాత ఎవరు మీలో కోటీశ్వరుడు షో కూడా ఆయన చేశారు.ఈ రెండు షోలు సూపర్ సక్సెస్ అయ్యాయి.ఇక ఇప్పుడు ఎన్.టి.ఆర్ తో కొత్త షో ప్లాన్ చేస్తున్నారు.ఈ షో వల్ల ఎన్.టి.ఆర్ మరోసారి తన స్టామినా ఏంటో చూపించనున్నారు.ఈటీవీ విన్ ఓటీటీతో పాటుగా ఈటీవీలో కూడా ఈ షో టెలికాస్ట్ అవుతుందని తెలుస్తుంది.

బాలకృష్ణ ఆహా కోసం అన్ స్టపబుల్ షో చేశారు.ఇప్పుడు ఎన్.టి.ఆర్ ఈటీవీ విన్ లో కొత్త షో స్టార్ట్ చేస్తున్నారు.అయితే ఎన్.టి.ఆర్ హోస్ట్ గా ఓటీటీ షో అనగానే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఈ టైం లో రిస్క్ వద్దని.పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు.

మరి ఫ్యాస్ మాట తారక్ వింటాడా లేదా అన్నది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube