ఎన్టీఆర్ - నీల్ మూవీ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు.. క్లారిటీ ఇదే!

జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR ) ప్రజెంట్ గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న క్రమంలో ఈయన భారీ లైనప్ ను కూడా సెట్ చేసుకుంటూ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తున్నాడు.ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా ( Devara ) చేస్తున్న విషయం తెలిసిందే.

 Ntr Prasanth Neel Ntr31 Update, Prabhas , Salaar, Priyanka Chopra , Prashanth Ne-TeluguStop.com

జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్( Prashanth Neel ) డైరెక్షన్ లో ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే.అందుకే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా గురించి కొత్త రూమర్ తెరపైకి వచ్చింది.ప్రస్తుతం నీల్ కూడా సలార్ ఈ నెలలోనే రిలీజ్ కాబోతుండడంతో ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా రిలీజ్ అయ్యాక నీల్ కాస్త ఫ్రీ అవ్వనున్నాడు.తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పనులను జనవరి తర్వాత స్టార్ట్ చేయనున్నారట.

ప్రీ ప్రొడక్షన్ పనులను నీల్ స్టార్ట్ చేస్తారని 2025 సమ్మర్ తర్వాత ఎన్టీఆర్ తో నీల్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది.ఏది ఏమైనా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ( Priyanka Chopra )హీరోయిన్ గా నటించబోతుంది అనే రూమర్స్ హల్చల్ చేయగా ఇంకా ఏ నటీనటులను అయితే మేకర్స్ ఫిక్స్ చేయలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube