NTR Buchi Babu : ఎన్టీఆర్‌ అన్నా నీకు ఇది తగునా.. పాపం ఆ బాబు రెండేళ్లు వృధా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆరు నెలలు దాటి పోయింది.ఇప్పటి వరకు ఆయన తదుపరి సినిమా కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు.

 Ntr Next Movie With Director Buchibabu Update,ntr,uppena,rrr,director Buchi Babu-TeluguStop.com

కొరటాల శివ దర్శకత్వం లో ఆయన హీరో గా ఒక సినిమా రావాల్సి ఉంది.కానీ ఇప్పటి వరకు ఆ సినిమా కు సంబంధించిన కథ రెడీ అవ్వలేదని వార్తలు వస్తున్నాయి.

ఆచార్య సినిమా నిరాశ పర్చడం తో దర్శకుడు కొరటాల శివ కాస్త ఎక్కువ సమయం స్క్రిప్ట్ కోసం తీసుకుంటున్నాడట.ఎన్టీఆర్ కూడా వెంటనే ఓకే చెప్పకుండా మార్పులు చేర్పులు చెబుతూ పదే పదే సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని మారుస్తున్నారట.

దాంతో కొరటాల శివ మూవీ ఆలస్యం అవుతుంది.ఈ సినిమా ఆలస్యం అవ్వడం వల్ల బుచ్చిబాబు దర్శకత్వం లో సినిమా మరింతగా ఆలస్యం అవుతుందన్నట్టు ప్రచారం జరుగుతుంది.

Telugu Buchi Babu, Ntr, Koratala Siva, Telugu, Uppena-Movie

ఉప్పెన సినిమా విడుదలై దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది.ఇప్పటి వరకు బుచ్చిబాబు తన తదుపరి సినిమా కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.ఎన్టీఆర్ తో తన తదుపరి సినిమాని చేయాలని బుచ్చి బాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.ఇప్పటికే చెప్పిన స్టోరీ లైన్ కి ఓకే చెప్పడంతో బుచ్చిబాబు స్క్రిప్టు రెడీ చేసే పనిలో ఉన్నాడు.

స్క్రిప్ట్ కూడా రెండు మూడు సార్లు రఫ్ గా ఎన్టీఆర్ కి వినిపించడం దానికి ఎన్టీఆర్ ఒకే చెప్పడం జరిగింది.దాంతో ఎన్టీఆర్ ఎప్పుడు ఎప్పుడు డేట్ లో ఇస్తాడా అంటూ బుచ్చిబాబు ఎదురు చూస్తున్నాడు.

ఒక సూపర్ హిట్ అందించిన దర్శకుడికి పాపం రెండు మూడు సంవత్సరాల సమయం లో వృధా చేయడం ఏమాత్రం తగదు అంటూ ఎన్టీఆర్ పై కొందరు సినీ ప్రేమికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube