టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి మనందరికీ తెలిసిందే.ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో( Devara ) నటిస్తున్నారు.
ఈ సినిమా కంటే ముందు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీలో నటించి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఈ మూవీతో తారక్ ను అభిమానించే వారి సంఖ్య మరింత పెరిగింది.
ప్రపంచ దేశాల్లో ఈ నందమూరి వారసుడికి ఫ్యాన్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు.ఆ మూవీలో అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ నటనకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

ఆర్ఆర్ఆర్( RRR ) తర్వాత స్మాల్ గ్యాప్ తీసుకున్న తారక్ ఇప్పుడు దేవర మూవీ చేస్తున్నారు.అయితే దసరా పండుగ కానుకగా విడుదల కానుంది.వాస్తవానికి ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 10కి వాయిదా వేశారు మూవీ మేకర్స్.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇటీవల హైదరాబాద్ లో( Hyderabad ) కీలక సన్నివేశాలు చిత్రీకరించారు మేకర్స్.సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తారక్ ఈ మూవీ పైనే పూర్తిగా ఫోకస్ పెట్టారు.అయితే ఇయర్ అంతా షూటింగ్ లో బిజీగా గడిపే హీరోలు సమ్మర్ లో రెస్ట్ తీసుకుంటారు.

కుటుంబంతో ట్రిప్స్ వెళ్తుంటారు.ఇప్పటికే కొందరు ప్లాన్స్ కూడా వేసేశారు.కానీ తారక్ మాత్రం దేవర కోసం కష్టపడుతున్నారు.దేవర షూటింగ్ ను త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు.అందుకు తాజాగా గోవా( Goa ) బయలు దేరారు.ఇప్పటికే ఎయిర్ పోర్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్న పిక్స్ వైరల్ అవ్వగా తాజాగా మరో ఫోటో బయట కొచ్చింది.
ఫ్లైట్ లో సూపర్ లుక్ లో ఉన్న యంగ్ టైగర్ ను చూసి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.సూపర్ ఉన్నావ్ అన్న అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
బ్రౌన్ కలర్ హుడి వేసుకున్న తారక్.చాలా కూల్ గా కనిపిస్తున్నారు.
ఫుల్ గెడ్డం , బ్లాక్ కలర్ కూల్ గ్లాసెస్ తో ఆకట్టుకుంటున్నారు.