దేవర కూడా పుష్ప బాట లో నడుస్తుందా..?

ఈమధ్య అన్ని సినిమాలు రెండూ పార్ట్ లు గా వస్తున్నాయి.

అయితే మొదట్లో బాహుబ‌లికి రాజ‌మౌళి ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించినా మొదట్లో ఒకే సినిమాగా తీయాల‌నుకున్నారు.

బాహుబలి రెండు భాగాలు బ్లాక్ బస్టర్స్ అయిన తర్వాత, ప్రశాంత్ నీల్ కన్నడలో ‘కేజీఎఫ్‌’ సినిమా ను చాప్టర్‌ 1, 2 అంటూ రెండు భాగాలుగా విడుదల చేశాడు.బాహుబలి స్ఫూర్తితోనే ఇలా రెండు భాగాలుగా విడుదల చేశాడని అర్థమవుతోంది.

తర్వాత సుకుమార్ అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప చిత్రాన్ని( Pushpa Movie ) కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.ఆ సినిమా మేకింగ్ సమయంలో మేల్ లీడ్ పాత్ర స్టోరీ అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో డెవలప్ కావడంతో మధ్యలో ఓ ట్విస్ట్ చేసి రెండు భాగాలుగా తయారు చేశారు.

అలా పుష్ప మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.రెండో భాగం వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి రంగం సిద్ధం అవుతుంది.

Advertisement

ఇప్పుడు ఎన్టీఆర్( NTR ) దేవర ( Devara Movie ) కూడా ఇదే దారిలో వెళ్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.కొరటాల శివ( Koratala Siva ) తారక్‌ల క్రేజీ కాంబినేషన్‌తో తెరకెక్కుతుంది.సెట్స్‌పై ఉన్న ఈ సినిమా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొనెలా చేస్తుంది.

అందుకే దేవరను కూడా రెండు భాగాలుగా చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ విషయాన్ని విడుదల చేసే వరకు గోప్యంగా ఉంచాలని బృందం యోచిస్తోంది.

స్టార్ మూవీస్‌కి సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ ఏమైనప్పటికీ లీక్ అవుతుండి.తాజాగా దేవర కూడా బాహుబలి కేజీఎఫ్ పుష్ప లా రెండు భాగాలుగా విడుదల చేయడానికి ప్లాన్ చేయడం కొంతమంది ఫ్యాన్స్ కి నచ్చుతుంది.

కథ డిమాండ్ మేరకు ఇలా చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ రెండు భాగాలుగా చేయడం మంచి పనికాదని, నక్కను చూసి వాతపెట్టుకోవడమే అని ట్రోల్స్ చేస్తున్నారు.దేవర సినిమాను కొరటాల శివ చాలా ప్రెస్టీజియస్ గా భావిస్తున్న సంగతి తెలిసిందే.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

ఈ సినిమా కోసం తన సర్వస్వం ఇస్తున్నాడు.ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కూడా ఈ సినిమా ద్వారా తన స్టామినాను మరోసారి నిరూపించుకోవాలని భావిస్తున్నాడు.

Advertisement

ఈ నేపథ్యంలో రెండు భాగాలుగా సినిమాను చేస్తే దానికి ప్లస్ పాయింట్స్ ఎన్ని ఉంటాయో మైనస్ పాయింట్స్ కూడా అన్నే ఉంటాయి అవన్నీ ఆలోచించుకొని సినిమాలని 2 పార్ట్ లు చేస్తే బాగుంటుందని మరి కొందరు అంటున్నారు.

తాజా వార్తలు