‘మిర్చి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన కొరటాల శివ ఆ తర్వాత చేసిన ప్రతి ఒక్క సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకున్నాడు.ఇటీవల ఈయన మహేష్‌బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని తెరకెక్కించి రికార్డులు బద్దలు కొట్టాడు.
ప్రస్తుతం చిరంజీవి 152వ చిత్రానికి ఏర్పాట్లు చేస్తున్నాడు.వచ్చే నవంబర్‌లో చిరంజీవితో సినిమాను షురూ చేసేందుకు ప్రస్తుతం స్క్రిప్ట్‌ను రెడీ చేసుకుంటున్న దర్శకుడు కొరటాల శివ త్వరలోనే ఎన్టీఆర్‌తో మరో సినిమాను చేసేందుకు డేట్లు తీసుకున్నాడు.
కొరటాల సినీ పరిశ్రమకు రావడంలో మిక్కిలినేని సుధాకర్ సాయం చాలా ఉంది.అందుకే ఆయన్ను నిర్మాతగా చేసేందుకు కొరటాల ఈ చిత్రాన్ని చేయబోతున్నాడు.

తన స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్‌ను నిర్మాతగా పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో రామ్ చరణ్ హీరోగా ఒక చిత్రాన్ని మొదలు పెట్టాడు.ఆ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.అయితే రామ్ చరణ్ ఇతరత్ర షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.మిక్కిలినేనిని నిర్మాతగా పరిచయం చేస్తాను అంటూ కొరటాల ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఎన్టీఆర్‌ను ఒప్పించి, మిక్కిలినేని నిర్మాణంలో నటించేందుకు ఓకే చెప్పించాడు.
జనతా గ్యారేజ్ చిత్రంతో భారీ విజయాన్ని ఎన్టీఆర్‌కు ఇచ్చిన కొరటాల శివ మరో సక్సెస్‌ను ఎన్టీఆర్‌కు ఇవ్వడం ఖాయం అంటూ నందమూరి ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.

వచ్చే నవంబర్ నుండి చిరంజీవి 152వ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్న కొరటాల శివ, ఆ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరా లేదా దీపావళికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచక జరుగుతున్నాయి.చిరు మూవీ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ మూవీని పట్టాలెక్కించే అవకాశం ఉంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ చిత్రాన్ని చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చరణ్‌తో కలిసి ఒక భారీ మల్టీస్టారర్‌ను చేసేందుకు సిద్దం అయ్యాడు.ఆ చిత్రం 2020లో విడుదల కాబోతుంది.
దాంతో 2020 ఆరంభంలో ఎన్టీఆర్, కొరటాల శివల కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది.అదే ఏడాది చివర్లో మరో జనతా గ్యారేజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌కు మరోసారి చేసే అవకాశం రావడంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరో జనతా గ్యారేజీ వచ్చేందుకు 2020 వరకు ప్రేక్షకులు ఎదురు చూడాల్సిందే.
వరుసగా ఎన్టీఆర్ భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలతో పలకరించడం ఖాయంగా అనిపిస్తుంది.అరవింద సమేత చిత్రం ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.వచ్చే ఏడాది ఎన్టీఆర్ మూవీని చూసే అవకాశం ప్రేక్షకులకు లేదు.2020లో రెండు సినిమాలతో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్స్‌ను దక్కించుకుంటాడనే టాక్ వినిపిస్తుంది.







