పీకే ను పీకేస్తారా ..? వైసీపీకి ఆయన ఉపయోగపడుతున్నాడా ..?

వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ( పీకే ) వ్యవహారం వైసీపీలో ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.వైసీపీ కి పీకే సేవలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి.? ఆయన వైసీపీ కి ప్లస్ అవుతున్నాడా .? మైనెస్ అవుతున్నాడా అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.ఎందుకంటే ఇటీవల జగన్ కు అనేక ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.వీటన్నిటికీ పీకే నే కారణం అని వైసీపీ నాయకులు ఆయన వైపు గుర్రుగా చూస్తున్నారు.మొన్న పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా విమర్శించడం, నిన్న కాపుల రిజర్వేషన్ గురించి ఇవ్వడం కష్టం అని మాట్లాడి ముద్రగడ విమర్శలకు గురి కావడం లాంటివి పీకే సలహాలేనని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

 What Is Prashnt Kishor Situation In Ysrcp-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని జగన్ తీవ్రంగా ఆలోచన చేస్తున్నాడు.అందుకే గత ఏడాది పీకేని సంప్రదించి వైసీపీ కి రాజకీయ సలహాలు ఇవ్వాల్సిందిగా ఆయన్ను ఒప్పించి తీసుకొచ్చారు.జగన్ ను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సీఎం పీఠం ఎక్కించాలని పీకే చూస్తున్నాడు.

కానీ ఆయన ప్లాన్ లు అన్ని బెడిసికొట్టడం జగన్ లో అసహనం పెంచుతోంది.కొన్ని రోజుల్లో జరుగుతున్న పరిణామాలు జగన్ కు అంత కలిసొచ్చేవిగా కనిపించడం లేదు.

ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఏపీలో బెడిసికొడుతున్నట్టు కనిపిస్తోంది.

జగన్ పనులకి సొంత పార్టీ కార్యకర్తల్లోనే విముఖత కనబడుతుంది.జగన్ విమర్శలను వెనకేసుకొచ్చి, కార్యకర్తలు నానా తంటాలు పడుతున్నారు.ఇలాంటివన్నీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నాయి.

ఆంధ్రా ప్రాంత రాజకీయాల మీద కొంత పట్టు లేకపోవడం, అనుభవ కొరత, రాష్ట్ర రాజకీయాల విషయం లో జగన్ ని నిలపడం కోసం ప్రశాంత్ సరైన వ్యూహాలు తీర్చిదిద్ధలేక పోతున్నారని ఈ పరిస్థితుల బట్టి అర్ధమవుతుంది.

ఈ సమయంలోనే వైసీపీ లో ఇంకో వాదన కూడా వినిపిస్తోంది.

ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను పక్కన పెట్టి సొంత ధోరణిలో జగన్ వ్యవహరిస్తున్నారని అందుకే జగన్ కు ఈ మధ్యకాలంలో పరిణామాలు కలిసిరావడంలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే ఇంకా పీకే అవసరం ఉందా .? అనే వాదనలు బహిరంగంగానే పార్టీ నేతల మధ్య చర్చకు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube