ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాంబోలో మూవీ .. పబ్లిసిటీ స్టంట్ అంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో ఉన్నారు.పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న తారక్ తర్వాత ప్రాజెక్ట్ లపై సైతం మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

 Ntr Kalyan Ram Combination Movie Fixed Details Here Goes Viral ,  Combination Mo-TeluguStop.com

అయితే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో బింబిసార2 తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని కళ్యాణ్ రామ్ ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో వెల్లడించారు.అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఇది పబ్లిసిటీ స్టంట్ అని చెబుతున్నారు.

తారక్ తర్వాత ప్రాజెక్ట్ లు ఇప్పటికే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఫిక్స్ అయ్యాయి.కెరీర్ విషయంలో తారక్ కొంతమేర రిస్క్ తీసుకోవడానికి కూడా అస్సలు సిద్ధంగా లేరనే సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ ఇప్పటికే ఓకే చెప్పిన ప్రాజెక్ట్ లు పూర్తవ్వాలంటే మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.బింబిసార డైరెక్టర్ వశిష్ట్ కొత్త దర్శకుడు అనే సంగతి తెలిసిందే.

Telugu Bimbisara, Ntr, Kalyan Ram, Ntr Fans, Ntr Kalyan Ram, Publicity Stunt-Mov

బింబిసార ట్రైలర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేలా ఉన్నప్పటికీ వశిష్ట్ స్టార్ హీరోలను హ్యాండిల్ చేయగలరనే నమ్మకాన్ని మాత్రం ఫ్యాన్స్ కు కలిగించలేకపోయారు.వశిష్ట్ కు ఛాన్స్ ఇచ్చి సినిమా ఫ్లాప్ అయితే కెరీర్ విషయంలో ఎన్టీఆర్ నష్టపోయే అవకాశం ఉంది.చాలా సంవత్సరాల క్రితం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఎవడు సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

Telugu Bimbisara, Ntr, Kalyan Ram, Ntr Fans, Ntr Kalyan Ram, Publicity Stunt-Mov

అయితే వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తర్వాత క్లారిటీ వచ్చింది.చరణ్, అల్లు అర్జున్ ఎవడు సినిమాలో నటించి ఆ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నా బింబిసార2 మాత్రం సరైన ఎంపిక కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బింబిసార భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube