మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈయన వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనే సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా ఎన్టీఆర్ తాజాగా తన అన్నయ్య కళ్యాణ్ రామ్( Kalyan Ram ) హీరోగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి( Arjun s/o Vyjayanthi ) సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ తన సినిమాల గురించి అలాగే వ్యక్తిగత విషయాలు గురించి కూడా మాట్లాడారు.ఇది ఒక తల్లి-కొడుకు ఎమోషనల్ బంధాన్ని ఆధారంగా చేసుకున్న కమర్షియల్ చిత్రమని, ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని అన్నారు .కళ్యాణ్ రామ్ అన్నయ్య తన సినిమాలతో ఎప్పుడు కొత్తదనాన్ని పరిచయం చేస్తారని ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని తెలిపారు.

విజయశాంతి( Vijayashanti ) గురించి మాట్లాడుతూ.ఆమె లేడీ సూపర్‌స్టార్‌గా తెలుగుకు ఎంతో గొప్ప పేరు తెచ్చారని, ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుందని తెలిపారు.విజయశాంతి తెలుగుతనం ఉట్టిపడేలా కనిపిస్తారని అన్నారు.
అలాగే ఈ రోజు విజయశాంతి గారు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నాకు నాన్నగారే గుర్తుకు వచ్చారు.ఈ రోజు.
నాన్న లేని లోటు విజయశాంతి భర్తీ చేశారని ఎన్టీఆర్ విజయశాంతి గురించి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీ విడుదల కాబోతుందని ప్రతి ఒక్కరు థియేటర్ కి వచ్చి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలి అంటూ తారక్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.