తెలుగు సినిమా ఇండస్ట్రీ లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా పేరుపొందిన ఎన్టీఆర్( Sr ntr ) గురించి చెప్పాల్సిన పనిలేదు.ఆయన పోషించని పాత్ర లేదు.
ఆయన చేయని క్యారెక్టర్ లేదు.ఇండస్ట్రీలో ఏ క్యారెక్టర్ అయిన సరే ఎన్టీఆర్ నటించి మెప్పించాడు అనే చెప్పాలి.
ముఖ్యంగా రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు లాంటి గొప్ప పాత్రలను తను పోషించి ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో తనని తాను రిప్రజెంట్ చేసుకున్నాడనే చెప్పాలి.ఇలాంటి క్రమంలో ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి.

ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీయార్ కొడుకు అయిన హరికృష్ణ( Harikrishna ) రెండోవ భార్య కి జూనియర్ ఎన్టీఆర్ జన్మించాడు.అయితే వీళ్ళ బాగోగులు కూడా సీనియర్ ఎన్టీఆర్ చూసుకుంటూ వచ్చేవాడు.ఇలాంటి క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు పెళ్లి జరుగుతున్న సందర్భంలో హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ని, వాళ్ళ అమ్మని పెళ్లికి ఆహ్వానించాడు.ఇక వీళ్లిద్దరూ ఆటోలో పెళ్లి మండపం దగ్గరికి రాగానే ఆ విషయం తెలుసుకున్న సీనియర్ ఎన్టీయార్ హరికృష్ణ మీద కోపానికి వచ్చి చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు పెళ్లికి వస్తున్నారు వీళ్ళని ఎందుకు పెళ్లికి పిలిచావని సీనియర్ ఎన్టీఆర్ ఆయన మీద కోప్పడ్డాడట దాంతో వీళ్ళు వచ్చి రాగానే హరికృష్ణ వాళ్ళని మళ్లీ రిటర్న్ ఆటోలో పంపించాడట.

ఇక ఆ సంఘటనను తీవ్ర అవమానంగా గుర్తుంచుకున్న ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ ఎప్పటికైనా ఎన్టీఆర్ ని ఆ కుటుంబంలో చేర్చాలని నిశ్చయించుకొని తనని నటన మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పింది.ఇక దానికి తగ్గట్టు గానే ఎన్టీయార్ కూడా కసి గా నటన మీద ఫోకస్ పెట్టీ స్టార్ హీరోగా ఎదిగాడు…ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ( Nandamuri Family ) బాధ్యతను మొత్తం ఎన్టీయారే మోస్తున్నాడు…
.