యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( JR Ntr ) నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే.ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది ముగిసిన తారక్ మరో సినిమాను పూర్తి చేయలేక పోయాడు.
ఎట్టకేలకు ఈ ఏడాదిలో కొత్త సినిమాను లాంచ్ చేసి షూటింగ్ కూడా స్టార్ట్ చేసాడు.ప్రస్తుతం ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘‘దేవర‘.’

ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇటీవలే తారక్ బర్త్ డే రోజు ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అనౌన్స్ చేయగా భారీ రెస్పాన్స్ లభించింది.ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకోగా తారక్ ను మాస్ హీరోగా అదిరిపోయే లుక్ లో చూపించి కొరటాల ఆకట్టుకున్నాడు.ఇక ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీలోని నటీనటులను ఎంపిక చేస్తూ ఈ సినిమాపై హైప్ భారీగా పెంచుతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్బ్యటీ జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )ఫిక్స్ కాగా సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan ) విలన్ గా నటిస్తున్నాడు.ఇదిలా ఉండగా ఈ సినిమా షూట్ గురించి ఇప్పుడొక వార్త వైరల్ అయ్యింది.

స్టార్ట్ అయినప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నాల్గవ షెడ్యూల్ ఇప్పుడు పూర్తి అయ్యినట్టు తెలుస్తుంది.ఈ షెడ్యూల్ లో తారక్, సైఫ్ తో పాటు మిగిలిన నటీనటుల మధ్య యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించినట్టు తెలుస్తుంది.ఇక నెక్స్ట్ షెడ్యూల్ జులై నుండి స్టార్ట్ చేయనున్నారట.కాగా యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వబోతుంది.