ప్రస్తుత సమాజం రోజురోజుకు కసాయి రూపంలోకి మారుతుంది అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.భూమిపై దేనినైనా లెక్క కట్టవచ్చు కానీ తల్లి ప్రేమ, తల్లి నవమోసాలు మోసి కనిపించిన దానికి మాత్రం విలువ కట్టడం అసాధ్యం.
అటువంటి తల్లికు వృద్ధాప్యంలో సంతానం ఎంతో ఆసరాగా ఉండాలి.తల్లికి సేవ చేసే భాగ్యం కొందరికి మాత్రమే లభిస్తుంది.
అలా లభించడం ఒక వరంలా భావిస్తే అతడు మనిషి అవుతాడు.కాదంటే భూమిపై అత్యంత నీచుడిగా పేర్కొనబడతాడు.
అయితే ఓ కుమారుడు తన 80 ఏళ్ల తల్లిని కేవలం భార్య కోసం హతమార్చాడు అంటే వాడికంటే నీచుడు ఈ భూమిపై మరొకడు ఉండడు.ఆ కసాయి కొడుకు ఎవడో.
ఎందుకు కన్నతల్లిని హతమార్చాడు అనే వివరాలు చూద్దాం.

వివరాల్లోకెళితే.ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) లోని బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం రామకూరులో శ్రీనివాస రావు( Srinivasa Rao ) అనే వ్యక్తి తన భార్య, తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు.కుమారుడికి పెళ్లి అయ్యాక అత్తా కోడళ్ళ మధ్య గొడవలు జరగడం అనేది సర్వసాధారణం అని అందరికీ తెలిసిందే.
ఇక శ్రీనివాస రావు భార్యకి, తల్లికి మధ్య కూడా వివాహం జరిగినప్పటి నుంచి తరచూ గొడవలు జరిగేవి.కొంతకాలం క్రితమే శ్రీనివాసరావు ఒక కొత్త ఇల్లు కట్టుకున్నాడు.
ఆ తర్వాత అత్తా కోడల మధ్య గొడవలు మరింత పెరిగాయి.తల్లి ఇంట్లోకి వస్తే బయటకు వెళ్ళిపోతానని శ్రీనివాస రావు ను భార్య బెదిరించింది.
దీంతో శ్రీనివాసరావుకు ఏం చేయాలో అర్థం కాలేదు.చివరికి భార్య కోసం తల్లినే హతమార్చాలని అనుకున్నాడు.

ఒక మాస్టర్ ప్లాన్ రచించి తల్లిని ఊరి బయట ఉండే కుంట దగ్గరికి తీసుకువెళ్లి, ఆ ప్రాంతంలో ఎవరూ లేని సమయంలో తల్లిని కుంటలో తోసి చంపేశాడు.ఇక తనకేం తెలియనట్టు ఇంటికి వచ్చేసాడు.తెల్లవారుజామున అటువైపుగా వెళుతున్న పశువుల కాపరులు ముసలావిడ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, విచారించగా శ్రీనివాసరావు మాటతీరుపై కాస్త అనుమానం కలిగింది.
దీంతో తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయట పెట్టడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.పోలీసులు కేసు నమోదు చేసి శ్రీనివాసరావును అరెస్టు చేశారు.







