యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో సినిమా ప్రకటన వచ్చి చాలా నెలలు అవుతుంది.సినిమా ఆగస్టు లో షూటింగ్ ప్రారంభం కాబోతుందంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది.
కానీ ఆగస్టు లో సినిమా ప్రారంభం కాకపోవడంతో అసలు ఈ సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో ఆర్ఆర్ఆర్ వంటి భారీ సినిమాలో నటించిన తర్వాత ఎన్టీఆర్ నుండి రాబోతున్న సినిమా అంటే కచ్చితంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి.
ఆ అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ రెడీ చేయలేక పోతున్నాడని అందుకే ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేక పోతున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఇటీవల సోషల్ మీడియాలో ఎన్టీఆర్ 30 సినిమా గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఈ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడింది అంటూ కొత్త ప్రచారం మొదలైంది.సినిమా గురించి ఎవరికీ ఇష్టం వచ్చినట్లుగా వారు ఊహించేసుకుంటూ సోషల్ మీడియాలో కథనాలు రాస్తున్నారు.
ఇందుకు సంబంధించి క్లారిటీ అనేది ఏదీ లేకుండా పోయింది.ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుకుంటూ సినిమా గురించి అభిమానుల్లో ఆందోళన పెంచేస్తున్నారు.
కొరటాల శివ ఇప్పటి వరకు ఈ పుకార్లకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం తో ఆయన తీరుపై అభిమానులు మరింతగా మండిపడుతున్నారు.ఎన్టీఆర్ మరో వైపు బుచ్చి బాబుకి దగ్గరగా ఉంటున్నాడని, ఆయన స్క్రిప్ట్ వింటున్నాడని ప్రచారం జరుగుతుంది.ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా అతి త్వరలోనే ప్రారంభం కాబోతుందని ప్రచారం కూడా మొదలైంది.ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.
దాంతో అభిమానులు జుట్టు పీక్కుని ఏం జరగబోతుందో అంటూ ఎదురు చూస్తున్నారు.