ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది.సినిమా కు సంబంధించిన అప్డేట్ ఒకటి దర్శకుడు కొరటాల శివ విడుదల చేయడం జరిగింది.
సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అంటూ కొన్ని ఫోటోలను విడుదల చేశారు.అయితే ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పటికీ ముగుస్తుంది.
షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటూ నందమూరి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయం లోనే ఈ సినిమా కు దేవర అనే టైటిల్ ని కన్ఫామ్ చేశారు అంటూ ప్రచారం జరుగుతుంది.
సినిమా టైటిల్ కన్ఫమ్ అంటూ జరుగుతున్న ప్రచారం కూడా అసలు సినిమా ఉందా లేదా అనే అనుమానాలకు తెర దించడం లేదు.
ఇంకా కొందరు ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానంతోనే ఉన్నారట.
ఎందుకంటే కొరటాల శివ ఇప్పటి వరకు స్క్రిప్ట్ పూర్తి చేయలేదని, స్టోరీ లైన్ పైనే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు.ఒక వేళ కొరటాల శివ రెడీ చేసిన స్క్రిప్టు, కథ కనుక ఎన్టీఆర్ కి నచ్చక పోతే కచ్చితం గా సినిమా ను పక్కకు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.
అదే కనుక జరిగితే ఈ దేవర మరియు ఆ ఫోటోలు అన్నీ కూడా ఫేక్ అన్నట్లే అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

మొత్తానికి ఎన్టీఆర్ 30 సినిమా ఉందా లేదా అనే అనుమానాలు ఇంకా వ్యక్తం అవుతూనే ఉన్నాయి.షూటింగ్ ప్రారంభం అయ్యే వరకు ఈ సినిమా గురించి ఇలాంటి పుకార్లు షికార్లు చేయడం కామన్ అంటూ కొందరు నందమూరి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఏం జరగబోతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు పాటు వెయిట్ చేయాల్సిందే.