Pawan Kalyan: రాజకీయాల్లో హీరోయిజం చూపించిన పవన్ కళ్యాణ్.. కట్ చేస్తే పోలీస్ కేసు!

టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.నటుడుగా ఎంత మంచి గుర్తింపు అందుకున్నాడో చూసాం.

 Pawan Kalyan Showed Heroism In Politics Ends With Police Case Details, Pawan Kal-TeluguStop.com

తక్కువ సినిమాలు చేసినప్పటికీ గుర్తింపు మాత్రం ఓ రేంజ్ లో సొంతం చేసుకున్నాడు.అంతేకాకుండా అదే రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.

ఇక ఈయన ఒక నటుడుగానే కాకుండా రాజకీయ నేతగా కూడా సొంతంగా పార్టీ స్థాపించి మరింత గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తున్నాడు.

జనసేన పార్టీని స్థాపించి ఆ పార్టీ అధినేతగా బాధ్యతలు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్.

ఇక ఈయన వ్యక్తిగతంగా ఎంతో మందికి సహాయం చేశాడు.అలా వ్యక్తిగతంగా కూడా ఎంతోమంది మనసులను దోచుకున్నాడు పవన్ కళ్యాణ్.

ప్రస్తుతం అటు రాజకీయాల వైపు ఇటు సినిమాల వైపు బాగా బిజీగా ఉన్నాడు.సినిమా పరంగా కాస్త బ్రేక్ దొరికితే చాలు వెంటనే రాజకీయంగా ప్రచారాలు చేస్తూ కనిపిస్తున్నాడు.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తన సినిమా లక్షణాన్ని చూపించాడు.కట్ చేస్తే పోలీస్ కేసులో ఇరికాడు.ఇంతకు అసలు విషయం ఏంటంటే.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఇప్పటం అనే ఓ గ్రామంలో రోడ్ల కోసం కొన్ని ఇల్లు ధ్వంసం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే అసలు విషయం ఏంటంటే.పవన్ కళ్యాణ్ తన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకునేందుకు ఈ పటం గ్రామస్తు ప్రజలు తమ పొలాలను పవన్ కళ్యాణ్ కు అప్పజెప్పారు.

Telugu Janasena, Pawan Ippatam, Pawan Kalyan, Pawankalyan, Seshagirirao-Movie

దీంతో వెంటనే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మీద కక్ష కట్టారు.ఇక వెంటనే 120 అడుగుల రోడ్లు వేస్తామని చెప్పి ఆ గ్రామంలోని ఇళ్లను ధ్వంసం చేస్తామని ప్రచారాలు వచ్చాయి.దీంతో హైకోర్టు దీని మీద స్టే విధించగా తాజాగా పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామాన్ని సందర్శించడానికి వచ్చాడు.

ఈ నేపథ్యంలో ఆయన పెద్ద ఎత్తున కార్లలో మంగళగిరి నుంచి ఇప్పటం వరకు జోరుగా ప్రచారం చేస్తూ వెళ్లారు.

ఇక పవన్ కళ్యాణ్ టీఎస్ జీరో సెవెన్ జి జి 2 3 4 5 అని తెల్లకారులో టాప్ మీద కూర్చొని ప్రయాణించాడు.దీంతో ఈ విషయం పట్ల పవన్ పై కేసు నమోదు అయింది.

అదేంది ఈ విషయం గురించి కేసు జరగటం ఏంటి అని అనుకుంటున్నారా.

Telugu Janasena, Pawan Ippatam, Pawan Kalyan, Pawankalyan, Seshagirirao-Movie

అసలు విషయానికి వెళ్తే.గిప్పటం గ్రామానికి చెందిన శేషగిరిరావు పంతగాని అనే ఒక వ్యక్తి తన బంధువుల ఇంటికి 9:30 గంటల సమయంలో వెళుతుండగా రైల్వే మంత్రి దాటేసరికి నేషనల్ హైవే రోడ్డు వైపు నుంచి ఒకేసారి జనసేన పార్టీ కార్యకర్తలు కార్లల్లో, బైకులలో ర్యాలీగా ఇప్పటం రోడ్డు వైపుకు వస్తున్నారని.అది కూడా ఎటువంటి జాగ్రత్తలు లేకుండా అతి వేగంగా నడుపుతూ రావడంతో తను తన బైక్ ని కంట్రోల్ చేసుకోలేక కింద పడిపోయానని పోలీస్ కేసు పెట్టాడు.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కారు పైన కూర్చొని ఉన్నాడని తెలిపాడు.దీంతో కారు డ్రైవర్ రాష్ డ్రైవింగ్ చేస్తున్నందుకు.అంతేకాకుండా కారు పైన కూర్చున్న పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేయాలని పేర్కొన్నాడు.దీంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

మరి ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ ఏమని స్పందిస్తాడో తెలియదు కానీ.కొంతమంది మాత్రం అతడు కావాలని పవన్ ను టార్గెట్ చేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube