అమెరికాలోని డల్లాస్ లో ప్రవాస భారతీయులు మొన్నటి ఉగ్రవాద దాడిలో అమరులు అయిన భారత జవాన్లకి శ్రద్ధాంజలి ఘటించారు.మహాత్మా గాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఇర్వింగ్ లో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సంతాపానికి వందలాది మంది ప్రవాస భారతీయులు వచ్చి తమ నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మెమోరియల్ ఛైర్మన్ డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఫిబ్రవరి 14 భారత దేశ చరిత్రలో ఓ చీకటి రోజని అన్నారు.భారతీయులు మర్చిపోలేని ఘటనగా ఆ రోజుని ఎప్పుడూ గుర్తు చేసుకుంటారని అన్నారు.
ఈ చర్యలు ఓ పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.దాడిలో మరణించిన జవాన్ల కుటుంభ సభ్యులకి తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.

ఈ దాడి జరిగిన వెంటనే అమెరికా కాంగ్రెస్ లో ఉన్న భారత సంతతి నేతలు, పలువురు ఈ దాడిని ఖండించారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయులు అందరూ అమరవీరుల ఆత్మకి శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం ప్రకటించారు.అనంతరం కొవ్వొత్తులతో శాంతి ర్యాలి చేశారు.







