పిడుగు పడి ఎన్నారై విద్యార్థిని బ్రెయిన్ డామేజ్.. కన్నీరుమున్నీరు అవుతున్న తల్లిదండ్రులు!

అమెరికా దేశం,( America ) టెక్సాస్ రాష్ట్రం, హ్యూస్టన్‌ సిటీలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది.సిటీలోని హ్యూస్టన్‌ యూనివర్సిటీలో చదువుతున్న ఎన్నారై స్టూడెంట్ సుస్రూణ్య కోడూరు (25)( Susroonya Koduru ) పిడుగుపాటుకు గురయింది.

 Nri Student Suffers Brain Damage After Lightning Strike Detais, Nri Student, Sus-TeluguStop.com

దాంతో ఆమెకు బ్రెయిన్ డ్యామేజ్( Brain Damage ) అయింది.జులై నాలుగో వారంలో తన స్నేహితులతో కలిసి శాన్ జాసింటో మాన్యుమెంట్ పార్క్‌లోని చెరువుకు సమీపంలో నడుచుకుంటూ వెళుతుండగా ఆమెపై పిడుగు పడింది.

ఈ పిడుగు దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది.

ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన ఆమెకు మెరుగైన చికిత్స అందించడం అత్యవసరంగా మారింది.

వైద్యచికిత్స డబ్బుతో కూడుకున్న పని కాబట్టి ఆమె కుటుంబసభ్యులు చాలా ఆందోళన చెందుతున్నారు.ఆమె వైద్య ఖర్చుల కోసం డబ్బు సేకరించడానికి, తల్లిదండ్రులను భారతదేశం నుంచి అమెరికాకు తీసుకురావడానికి వారు GoFundMeలో ఫండ్ రైజింగ్ కూడా ప్రారంభించారు.

భయంకరమైన శబ్దంతో నిప్పులు కక్కుతూ పడిన పిడుగు( Lightning Strike ) వల్ల సుస్రూణ్య గుండె ఆగిపోయిందని.దాంతో మెదడు బాగా డామేజ్ అయ్యిందని వైద్యులు వెల్లడించారు.పిడుగుపాటు వల్ల ఆమె మెదడుకు చాలా గంటల పాటు ఆక్సిజన్ అందకుండా పోయిందని, అందుకే ఆమె కోలుకోలేక ఇబ్బంది పడుతోందని డాక్టర్లు చెబుతున్నారు.ఇప్పటికీ ఈ విద్యార్థిని కోమాలోనే ఉంది.

ఇప్పుడు ఆమె మెదడు నయం కావడానికి ప్రత్యేక గొట్టాల ద్వారా పోషకాహారం అందించాల్సి ఉంటుంది.శ్వాస తీసుకోవడానికి కూడా ఆమెకు వైద్య సహాయం కావాలి.యూఎస్‌లో మనుషులు పిడుగుపాటుకు గురికావడం అరుదు, సుస్రూణ్య లాంటి యుక్తవయస్కులకు అలా జరగడం అంతకన్నా అరుదు.పిడుగుపాటు వల్ల అందరూ మాత్రమే తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోతుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube