తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక కేంద్రం తెలిపింది.అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయని పేర్కొంది.
రానున్న 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో పలు ప్రాంతాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్డ్ జారీ చేసింది.
ఈ మూడు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇక మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.