భారతీయుడికి బంపర్ లక్కీ డ్రా..

ఈ మధ్య భారతీయుల పంట విదేశాలలో బాగానే పండుతోంది.గడిచిన రెండు మూడు నెలలో భారతీయులు విదేశాలలో ఎదో ఒక సందర్భంలో అక్కడ లాటరీలని సొంతం చేసుకుంటున్నారు.

 Nri Man Wins Million Dollars In Uae-TeluguStop.com

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్లకి కోట్ల రూపాయల డబ్బుని లక్కీ డ్రా లలో గెలుచుకోవడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయమనే చెప్పాలి.వివరాలలోకి వెళ్తే.


గత నెలలో కేరలాకి చెందినా ఒక కార్ మెకానిక్ దుబాయ్ లో ఉద్యోగం కోసం వచ్చి ఎన్నో సార్లు దుబాయ్ లాటరీలో తన లాక్కుని పరీక్షించుకు కున్నాడు.ఆసమయంలో అతడికి 14 కోట్ల లాటరీ తగలగా ఆ లాటరీలో సగం మొత్తాన్ని టిక్కెట్టు కొనడానికి సాయం చేసిన తన స్నేహితుడికి ఇచ్చాడు.

ఇదేవిధంగా అనిల్ వర్గిస్ తెవరిల్లే అనే భారత వలసదారుడికి బిగ్ టికెట్ రూపంలో అదృష్టం వరించింది.గురువారం ఉదయం అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో బిగ్ టికెట్ లక్కీ డ్రా నిర్వహించారు.

అందులో అనిల్ కొన్న టికెట్‌కే ప్రైజ్ మనీ దక్కింది.ప్రైజ్ మనీ వల్ల అనిల్ ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోయాడు…అతడు కొన్న టికెట్ అక్షరాలా ఏడు మిలియన్ దిర్హమ్స్ మన భారతీయ రూపాయలలో రూ.12కోట్ల 70 లక్షల 44 వేల 490 ప్రైజ్ మనీ గెలుచుకుంది.


తన కొడుకు పుట్టినరోజు కలిసి వచ్చేలా ఉన్న టికెట్ కొన్నానని.

అయితే తన కొడుకు అదృష్టం ఇలా మాకు కోట్లు తెచ్చి పెట్టిందని అనిల్ చెప్తున్నాడు.అనిల్ కువైట్‌లో ఓ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.26 ఏళ్లుగా అతడు అదే కంపెనీలు పనిచేస్తుండటం విశేషం.అయితే గత కొంతకాలంగా ఈ టిక్కెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షిన్చుకుంటూ ఉండేవాడు.

ఎట్టకేలకి అదృష్టం వరించింది అంటూ సంతో శం వ్యక్తం చేస్తున్నారు అనిల్ కుటుంభ సభ్యులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube