వైరల్ అవుతున్న ఎన్నారై చెఫ్.. అతడి చేతి వంట అదుర్స్..

భారతీయ వంటకాలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇష్టపడతారు.చాలా మంది విదేశీయులు భారతీయ ఆహారాన్ని ఆస్వాదిస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటారు.

 Nri Chef Going Viral, Indian Cuisine , Aggarwal Vaishno Dhaba, Chef Naresh, Punj-TeluguStop.com

వివిధ దేశాల్లోని భారతీయ రెస్టారెంట్లు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి.అయితే మొన్నటిదాకా యునైటెడ్ స్టేట్స్‌లో ఉంటూ అక్కడి ప్రజలకు తన వంట రుచి చూపించి మన్నలను పొందాడు ఒక ఇండియన్ చెఫ్.

తరువాత భారతదేశానికి తిరిగి వచ్చిన ఆ చెఫ్ వీడియో వైరల్ అయ్యింది.అతని పేరు నరేష్( Naresh ).అతను జలంధర్‌లో అగర్వాల్ వైష్ణో ధాబా( Aggarwal Vaishno Dhaba in Jalandhar ) అనే రెస్టారెంట్‌ని కూడా నడుపుతున్నాడు.ఈ ధాబాలో రుచికరమైన పంజాబీ వంటకాలను సరసమైన ధరలకు అందిస్తున్నాడు.

భారతదేశానికి తిరిగి రాకముందు, చెఫ్ నరేష్ యునైటెడ్ స్టేట్స్‌లో( Chef Naresh in the United States ) పది రెస్టారెంట్లను నడిపించాడు.అగర్వాల్ వైష్ణో ధాబాలో దాల్ మఖానీ, చోలే, కడాయి పనీర్, చనా మసాలా, కధీ పకోరా, మలై కోఫ్తా వంటి పాపులర్ వంటకాలు సర్వ్ చేస్తున్నాడు.ఒక బ్లాగర్ ఈ ధాబా స్పెషాలిటీ గురించి వీడియో తీసి షేర్ చేశాడు.ఈ వీడియోలో బ్లాగర్ పంజాబీ థాలీని ఆస్వాదిస్తున్నట్లు వీడియో కనిపించింది.

థాలీలో దాల్ మఖానీ, షాహీ పనీర్, మిక్స్‌డ్‌ వెజ్, పులావ్, బూందీ రైతా, తవా రోటీ, సలాడ్ ఉన్నాయి.ఈ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయింది.దీనికి 40 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.అగర్వాల్ వైష్ణో ధాబా జలంధర్‌లోని వసంత్ విహార్ రోడ్‌లో ఉంది.ఇది ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది.టేస్టీ ఫుడ్స్ ఆఫర్ చేసే ఈ ధాబాకు స్థానికులు రోజూ వందల సంఖ్యలో వస్తుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube