ఇక అందరికీ అందుబాటులో ..! ఇట్లు కేసీఆర్ 

గత కొద్దిరోజులుగా చూసుకుంటే బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ హడావుడి పడుతున్నారు.ఎక్కడికక్కడ పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు.

 Now Available To Everyone! This Is Kcr , Kcr, Brs, Telangana, Telangana Election-TeluguStop.com

ప్రభుత్వం తరఫున అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతూ పెద్ద ఎత్తున శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ హడావుడి చేస్తున్నారు.అంతేకాదు జిల్లాల వారీగా పార్టీ తరఫున  బహిరంగ సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇక పార్టీ శ్రేణులకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు.

తనను కలిసినందుకు  వచ్చే ఎమ్మెల్యేలు , పార్టీ కీలక నాయకులు అందరికీ అందుబాటులో ఉంటున్నారు.అయితే ఒక్కసారిగా కేసీఆర్ లో ఈ మార్పు రావడానికి కారణం ఏంటనే చర్చ ప్రస్తుతం బీఆర్ఎస్ లో జరుగుతోంది.

Telugu Ap Brs, Central, Telangana-Politics

గతంలో కేసీఆర్ ను ఎవరైనా కలవాలంటే అది పెద్దతంగమే.ఆయన ఎప్పుడు ఫామ్ హౌస్ కి పరిమితమయ్యేవారు.అప్పుడప్పుడు మాత్రమే ప్రగతి భవన్ కు వచ్చేవారు.కానీ ఇప్పుడు ఎక్కువగా ప్రగతి భవన్ లోని కనిపిస్తున్నారు.

దీనికి కారణం మరి కొద్ది నెలల్లోనే తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు రాబోతూ ఉండడమే కారణం .మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించేందుకు కేసిఆర్ ప్రయత్నిస్తున్నారు.తెలంగాణలో గెలవడం ద్వారానే దేశ వ్యాప్తంగా బి.ఆర్.ఎస్ ప్రభావాన్ని పెంచవచ్చని, ఇక్కడ ఫలితం అనుకూలంగా రాకపోతే దేశవ్యాప్తంగా బలహీనం అవుతాం అనే విషయాన్ని కేసిఆర్ గుర్తించారు.అందుకే ఇక నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వీలైనన్ని ఎక్కువ బహిరంగ సభలు నిర్వహిస్తూ,  తెలంగాణలో విజయం కోసం కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు.

గత రెండు నెలల్లోనే ఏడు బహిరంగ సభలను నిర్వహించి కేసీఆర్ తన సత్తా చాటుకున్నారు.

Telugu Ap Brs, Central, Telangana-Politics

అలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ దూకుడు పెంచారు.అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ,  పెండింగ్ లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు.  అలాగే ఉద్యోగుల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ, వారికి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

కెసిఆర్ లో ఈ రకమైన మార్పు రావడం,  పార్టీ నాయకులకు అందుబాటులో ఉండడం, అలాగే ఎక్కువగా ప్రజలను తిరిగేందుకు కేసిఆర్ ప్రయత్నిస్తూ ఉండడం , ఇవన్నీ పార్టీ కేడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పై పార్టీ శ్రేణులతో పాటు, ప్రజల్లోనూ సానుకూలత కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube