ప్రముఖ భారతీయ నటి, మోడల్, నృత్య కళాకారిణి, మరియు టివి వ్యాఖ్యాత అయినటువంటి మలైకా అరోరా గురించి తెలియనివారు దాదాపు ఉండనే వుండరు.మలైకా అరోరా ఎక్కువగా హిందీ సినిమాల ద్వారానే పేరు తెచ్చుకుంది.
ఈ క్రమంలో 2008లో ఈమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తో కలిసి అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో ఓ చిత్ర నిర్మాణం స్థాపించింది.ఈ సంస్థ ‘దబాంగ్‘ అనే పేరుతో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో ఓ విజయవంతమైన చిత్రం నిర్మించింది.
ఆ తరువాత కూడా పలు సినిమాలను నిర్మించారు.ఈమె మహారాష్ట్రలోని థానేలో 1973, అక్టోబరు 23 న జన్మించింది.

ఇకపోతే మలైకా అరోరా, అర్బాజ్‌ఖాన్‌లు విడిపోయిన చాన్నాళ్ల తర్వాత ఓ అరుదైన ఘట్టం చోటుచేసుకుంది.2017లో విడాకులు తీసుకున్న ఈ జంట తాజాగా కొడుకు అర్హాన్‌ఖాన్‌ను అమెరికాకు సాగనంపేందుకు విడివిడిగా ఎయిర్ పోర్టుకు రావడం జరిగింది.ఎయిర్ పోర్టులో అర్హాన్‌ఖాన్ తల్లితో కాసేపు, తండ్రితో కాసేపు ముచ్చటించాడు.ముందుగా తల్లిని హగ్ చేసుకుని బాయ్ చెప్పి తండ్రి దగ్గరికి వచ్చాడు.తర్వాత తండ్రికి వీడ్కోలు పలికి ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లిపోయాడు.ఆ తర్వాత మాజీ భార్యభర్తలైన మలైకా అరోరా, అర్బాజ్‌ఖాన్ వెనుదిరిగి తమతమ కార్ల దగ్గరికి వెళ్లిపోయారు.

ఇక్కడే ఆసక్తికరమైన సంఘటన ఆచోటు చేసుకుంది.ఈ సందర్భంగా అర్బాజ్ ఖాన్.మలైకా అరోరాను పలరించడం జరిగింది.తర్వాత మలైకా కంటే ముందు నడుస్తున్న అర్బాజ్ ఆగిపోయి ఆమెవైపు తిరుగాడు.అమె కూడా అతనికి దగ్గరగా వెళ్ళింది.తరువాత ఇద్దరూ హగ్ చేసుకుని వీడుకోలు చెప్పుకున్నారు.
ఆ తర్వాత ఎవరి వాహనాల్లో వాళ్లు అక్కడినుండి వెళ్లిపోయారు.అయితే, ఐదేండ్ల క్రితం విడిపోయిన సెలెబ్రిటీ భార్యాభర్తలు చాన్నాళ్ల తర్వాత ఎదురుపడి కౌగించుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.నెటిజన్‌లు అయితే కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
విడిపోయినప్పటికీ వీరిమధ్య ఇంకా ప్రేమ వుంది అని చెప్పుకుంటున్నారు.







