తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో 9231 పోస్టుల భర్తీ( Telangana Gurukuls ) కోసం భారీ నోటిఫికేషన్ ను గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డ్( TREIRB ) ఇటీవలే విడుదల చేసింది.దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 17 నుంచి ఆన్లైన్ లో ప్రారంభం అవ్వనుంది.
ఇందులో డిగ్రీ కళాశాలలో అధ్యాపక, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ల ద్వారా 868 పోస్టులు భర్తీ చేయనున్నారు.
జూనియర్ కళాశాలలో 2008 లెక్చరర్ పోస్టులు, పాఠశాలలలో 1276 పీజీటీ పోస్టులు, 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్, 92 క్రాఫ్ట్, 124 మ్యూజిక్, 4020 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈనెల 12 నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని 17 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ మల్లయ్య భట్టు తెలిపారు.
గురుకులాల్లో 4020 గ్రాడ్యుయేషన్ టీచర్( Graduate Teachers ) పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఈనెల 28 నుంచి మే 27 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.పే స్కేల్ రూ.42,300 నుంచి రూ.1,15,270 వరకు ఉంటుంది.

1276 పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.పే స్కేల్
రూ.45,960 నుంచి రూ.1,24,150 వరకు
ఉంటుంది.
434 లైబ్రేరియన్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు అప్లై చేసుకోవచ్చు.పే స్కేల్ రూ.38,890 నుంచి రూ.1,12,510 వరకు ఉంటుంది.

డిగ్రీ కళాశాలలో అధ్యాపక, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు మొత్తం 868.ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.పే స్కేల్ రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు ఉంటుంది.
ఏప్రిల్ 17న పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల అవ్వనుంది.ఇందులో విద్యార్హతలు, వయోపరిమితి, పోస్టుల వివరాలు, దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలు ఉండనున్నాయి.అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 17 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు.







