మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‎కు నోటీసులు

Notices To Hero Navdeep In Madapur Drug Case

హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసుపై నార్కోటిక్ బ్యూరో అధికారులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇందులో భాగంగా తాజాగా సినీ హీరో నవదీప్ కు నోటీసులు జారీ చేశారు.

 Notices To Hero Navdeep In Madapur Drug Case-TeluguStop.com

ఈ మేరకు 41 ఏ కింద నవదీప్ కు అధికారులు నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది.ఈ క్రమంలో ఎల్లుండి విచారణకు హాజరు కావాలంటూ నార్కోటిక్ బ్యూరో అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

కాగా మాదాపూర్ లోని సర్వీస్ అపార్ట్ మెంట్ లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీ కేసులో ఏ-29 నిందితుడిగా నవదీప్ ఉన్న సంగతి తెలిసిందే.డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని పోలీసుల వైఖరిని తప్పుపడుతూ నవదీప్ హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై పోలీసులు రూల్స్ ఫాలో అవ్వాలన్న ధర్మాసనం నవదీప్ ను విచారించాలంటే 41 (ఏ) కింద నోటీసులు ఇవ్వాలని, ఆ తరువాత విచారించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube