మన దేశంలో ఉన్న ఏ బార్బర్ షాపుకు వెళ్లినా.అక్కడ మనకు వింత వింత అనుభవాలు, కొత్త వ్యక్తుల పరిచయాలు ఎదురవుతుంటాయి.
సాధారణంగా బార్బర్ షాపుల్లో చాలా మంది షర్ట్‌లను తీసేసి కటింగ్, ట్రిమ్మింగ్, షేవింగ్ వంటివి చేయించుకుంటుంటారు.బార్బర్ షాపుల్లో మనకు ఇవి రెగ్యులర్‌గా కనిపించే దృశ్యాలే.
అయితే ఆ షాపుల్లో కొందరు అలా షర్ట్‌లను తీసేస్తుండడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందట.ఏంటీ.
నమ్మలేరా.అయినా ఇది నిజమే.
మరి అలాంటి ఇబ్బందిని ఎదుర్కొనే వారిని దృష్టిలో ఉంచుకుని ముంబైలో ఓ బార్బర్ షాపు ఓనర్ ఏం పనిచేశాడో తెలుసా.?
ముంబైలోని ఓ బార్బర్ షాపు ఓనర్ షాపులో షర్ట్‌లను తీసే వారినుద్దేశించి ఒక నోటీస్ పెట్టించాడు.అందులో ఏముందంటే.బార్బర్ షాపుకు వచ్చే కొందరు షర్ట్‌లను తీసేస్తున్నందువల్ల ఇతరులకు కొందరికి ఇబ్బంది కలుగుతుందని, కనుక షాపులో ఎవరూ షర్ట్స్ తీయవద్దని, వాటిని వేసుకునే ఉండాలని నోటీసు పెట్టించాడు.
దీంతో ఇప్పుడా నోటీస్ కాస్తా నెట్లో వైరల్ అవుతోంది.
అయితే.మన దేశంలో చాలా వరకు బార్బర్ షాపుల్లో ఇలా చాలా మంది షర్ట్‌లను తీసేయడం కామనే అయినప్పటికీ ముంబైలో ఓ బార్బర్ షాపులో అలా కనిపించే సరికి ఆ నోటీస్ కాస్తా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.అయితే కేవలం షర్ట్‌లను తీసేయడం మాత్రమే కాదు, బార్బర్ షాపుల్లో ఇంకా మనకు అనేక దృశ్యాలు కనిపిస్తుంటాయి.అవేమిటంటే…
కొందరు బార్బర్ షాపుల్లో బాడీ మసాజ్‌లు చేయించుకుంటారు.ముఖ్యంగా చేతులు, ఛాతీ, మెడ వంటి భాగాలను మసాజ్ చేయించుకుంటారు.
ఈ క్రమంలో సెలూన్లో పనిచేసే వారు ఆయా భాగాలను విరిచేస్తుంటారు.అయితే ఇలా మసాజ్ చేయించుకోవడం కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తుంది.2017లో ఢిల్లీలో ఇలాగే ఓ వ్యక్తి బార్బర్ షాపులో మెడ విరిపించుకున్నాడు.దీంతో అతని మెడ నరాలు దెబ్బ తిన్నాయి.
ఫలితంగా అతను హాస్పిటల్ పాలు కావల్సి వచ్చింది.ఇక బార్బర్ షాపుల్లో చాలా మంది టాల్కం పౌడర్‌ను కస్టమర్లకు ఇష్టం వచ్చినట్లు కొడతారు.
ఈ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తాయి.
సెలూన్లలో ఇప్పుడంటే ఒక వ్యక్తికి వాడిన బ్లేడును మరొకరికి వాడడం లేదు.వేరేగా వాడుతున్నారు.కానీ షేవింగ్ చేశాక గాయాలు ఏమైనా అయితే యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుందని చెప్పి రుద్దే పటికను మాత్రం ఇప్పటికీ ఒకరికి వాడిన దాన్నే మరొకరికి వాడుతున్నారు.
అలాగే కొందరు అవసరం లేకపోయినా.గంటల తరబడి వచ్చి సెలూన్లలో కూర్చుని ముచ్చట్లాడుతుంటారు.ఇలాంటి దృశ్యాలు కూడా మనకు అనేక సెలూన్లలో కనిపిస్తుంటాయి.దీంతోపాటు సెలూన్లలో మన బరువు, ఎత్తు, ముఖ వర్చస్సు, వెంట్రుకల సంరక్షణ వంటి అంశాల పరంగా మనకు అవసరం లేకున్నా కొందరు ఆ సేవలను అంటగట్టేందుకు తహతహలాడుతుంటారు.
ఇవన్నీ మన దేశంలో బార్బర్ షాపుల్లో తరచూ కనిపించేవే.కానీ ముంబైలో ఆ బార్బర్ షాపు ఓనర్ అలా మెసేజ్ పెట్టే సరికి ఈ విషయాలన్నీ ఇప్పుడు నెట్లో వైరల్ అవుతున్నాయి.