కారు జోరు మీద ఉందట ! సోషల్ మీడియా లో ఓ సర్వే హడావుడి

తెలంగాణాలో జరగబోతున్న ఎన్నికలపై అందరి దృష్టి పడింది.హోరాహోరీగా జరగబోతున్న ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరికి దక్కుతుంది అనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

 Lagadapati Rajagopal Survey Of Trs Party-TeluguStop.com

ఇప్పటికే అనేక అనేక సర్వేలు ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది.? ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి… అనే విషయంపై లెక్కతేల్చుతూ… తమ సర్వే రిపోర్ట్స్ బయటపెట్టాయి.ఇక పార్టీలు తమ ఎన్నికల ప్రచారంతో విజయం మాది అంటే మాది అంటూ … ఎవరికి వారు ధీమాగా ప్రచారంలో మునిగి తేలుతున్నారు.ఈ తెలంగాణ ఎన్నికల ఫీవర్ సోషల్ మీడియా లో కూడా బాగా ఎక్కువ కనిపిస్తోంది.

సాధారణ మీడియా కు పోటా పోటీగా ఇందులో పార్టీల ప్రచారం … వివిధ పార్టీల పోల్స్ తో … ఈ సోషల్ మీడియా హోరెత్తుతోంది.

అంతేకాదు … ఇప్పుడు లేటెస్ట్ సర్వే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.ఈ సర్వే లగడపాటి రాజగోపాల్ చేసిన సర్యేగా ప్రచారం చేస్తున్నప్పటికీ… దీనికి సంబంధించి ఆయన మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.కానీ మొత్తంగా చూస్తే ఈ సర్వే లో తెలంగాణాలో టీఆర్ఎస్ మళ్ళీ అధికారం చేపట్టడం ఖాయం అంటూ లెక్కతేల్చారు.అయితే… ఈ సర్వేకు ఇప్పటికే వేలల్లో లైకులు, కామెంట్ లు రావడం చూస్తే ఈ సర్వే రిజల్ట్ నిజమేనా అనే సందేహం కలుగుతోంది.

అయితే… కేసీఆర్ కు అధికారం దక్కకుండా చేయాలనే ఉద్దేశంతో … తమ వైరాన్ని కూడా పక్కనపెట్టి టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడినప్పటికి ఆ పార్టీలకు ఫలితం దక్కదని ఈ సర్వే తేల్చేసింది.

తెలంగాణలోని 119 స్థానాల్లో దాదాపుగా 80 నుండి 87 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పథకాలే ఆయన్ను గెలిపిస్తాయని ఆ సర్యే లో తేలడం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 20-23 స్థానాలు దక్కే అవకాశం ఉందని, ఆ పార్టీతో మూడున్నర దశాబ్దాల శతృత్వాన్ని పక్కనపెట్టి చేయి చేయి కలిపిన టీడీపీకి కేవలం 3-4 నియోజకవర్గాలు దక్కనున్నాయట.ఇక, కూటమిలోని మరో పార్టీ అయిన టీజేఎస్‌కి 02, సీపీఐకి 01, స్థానాలు దక్కుతాయని చెబుతుండగా ఎమ్‌ఐఎమ్‌కి 7 నియోజకవర్గాలలో పట్టు ప్రదర్శిస్తుందని చెబుతున్నారు.బీజేపీ 3-4 స్థానాలు దక్కుతాయని తేలిందట.

మొత్తంగా చూస్తే… తెలంగాణాలో కారు జోరు మీద ఉన్నట్టు సర్వేలో తేలింది.అయితే మరి కొద్ది రోజులు ఆగితే… ఎవరు అధికారం చేపడతారో.

ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube