మామూలుగా ఒక సినిమాను ప్రేక్షకులంతా కలిసి చూసినప్పుడు ఆ సినిమాను అందరూ ఒకేలా ఫీల్ అవ్వకుండా ఒక్కొక్కరు ఒక్కోలా ఫీల్ అవుతుంటారు.కొందరు కథను పాజిటివ్ గా తీసుకుంటే మరికొందరు నెగటివ్ గా తీసుకుంటారు.
అలా ఒక్కొక్కరి అభిరుచులు ఒక్కోలా ఉంటాయి.కొన్ని కొన్ని సార్లు అందరి అభిరుచులు ఒకేలా కనిపిస్తాయి.
అది వ్యక్తిగత విషయంలోనే కాకుండా సినిమాల విషయంలో కూడా ఉంటాయి.చాలామంది ప్రేక్షకులు ఒక సినిమాను ఒకే కాన్సెప్ట్ తో పాటు ఒకే రకంగా ఫీల్ అవుతూ చూస్తుంటారు.
నిజానికి చాలామంది సినిమాలలో కొత్తదనాన్ని వెతుకుతారు.లవ్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు అయినా, యాక్షన్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలో అయినా చాలా వరకు కొత్తదనం కోరుకుంటారు.
నిజానికి దర్శకులంతా లవ్, యాక్షన్ వంటి సినిమాలను ఒకటే కాన్సెప్ట్ తో ముందుకు తీసుకొని వస్తారు.కేవలం నటీనటులను మాత్రమే మారుస్తారు.
ఇందులో నిజానికి కొత్తదనం ఉండదు.అయినా కానీ ఇదివరకే వచ్చిన కాన్సెప్ట్ తో అయినా సరే చూడాలి అని అనుకుంటారు.
ఇక ఒకప్పుడు వచ్చిన సినిమాలను కూడా ఇప్పుడు కూడా చూడాలని అనుకుంటారు.అదే ఒకప్పటి సినిమాల కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చిన కూడా చూడటానికి ఇష్టపడతారు.
అలాంటిది అప్పటి సినిమాలు ఇప్పుడు వేసిన కూడా చూడటానికి వెనకాడరు.అందులో చాలా సినిమాలు ఉండగా.
ఒక సినిమా మాత్రం ఇప్పటికీ కూడా ఆ తరం ప్రేక్షకులతో పాటు ఈ తరం ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది.ఇంతకూ ఆ సినిమా ఏదో కాదు ఆరుగురు పతివ్రతలు.
ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో 2004 ఫిబ్రవరి 6న విడుదలైన సినిమా ఆరుగురు పతివ్రతలు.ఇందులో చలపతిరావు, ఎల్.బి.శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ లు ప్రధాన పాత్రలుగా నటించారు.ఇక ఈ సినిమా అప్పట్లో మంచి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది.ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న కథ అలాంటిది అన్నమాట.
ఈ సినిమాలో వచ్చిన కథను ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఒకేలా ఫీల్ అవుతూ చూశారు.ఇందులో ఆరుగురు అమ్మాయిల కథ పరంగా ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా ఇప్పటికీ టీవీలలో వస్తే మాత్రం అస్సలు చూడకుండా ఉండలేరని చెప్పాలి.ఆ సినిమాను ఇప్పుడు థియేటర్లో వేస్తే బాగుంటుంది అంటూ.
ఎలాగైనా ఈ సినిమాను థియేటర్లో వేయాలి అని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.పోకిరి, జల్సా సినిమాలు థియేటర్లో రెండోసారి విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇలాంటి సినిమాలు కాకుండా ఆరుగురు పతివ్రతలు సినిమాను థియేటర్లో వేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు.మరి ఈ ప్రేక్షకుల కోరిక మేరకు ఈ సినిమాను మరోసారి థియేటర్లో విడుదల చేస్తారో లేదో తెలియదు కానీ.
ఒకవేళ ఈ సినిమాని విడుదల చేస్తే మాత్రం కచ్చితంగా ఈ సినిమా ఒక రోజుకే భారీ వసూలు సొంతం చేసుకుంటుంది.