బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ ( Jabardasth )కార్యక్రమంలో కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో కమెడియన్ గడ్డం నవీన్ ( Gaddam Naveen )ఒకరు.కామెడీ చేస్తూ అందరిని నవ్విస్తూ ఉంటారు జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా సినిమాలలో కూడా ఎన్నో అవకాశాలను అందుకున్నారు.
ఈ విధంగా గడ్డం నవీన్ ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి మెప్పించారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా గడ్డం నవీన్ మాట్లాడుతూ జబర్దస్త్ కార్యక్రమం మొదట్లో పాల్గొన్నటువంటి ఎంతోమంది కమెడియన్స్ అందరూ కూడా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్నారు.కొందరు డైరెక్టర్లుగా మారుగా మరికొందరు హీరోలుగా కూడా మారిపోయి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారని తెలిపారు.ఇలా డైరెక్టర్ కావాలి అంటే ఎన్నో తెలివితేటలు ఉండాలి అందుకే నేను నిర్మాతగా ( Producer ) సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

ఇండస్ట్రీలో ఎప్పటికైనా నిర్మాతగా మారి సినిమాలో చేయాలనేది నా కోరిక అని అలాగే ఎప్పటికైనా ఒక సింగిల్ థియేటర్ నిర్మాణం చేపట్టడమే నా కల అంటూ ఈ సందర్భంగా జబర్దస్త్ కమెడియన్ గడ్డం నవీన్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక తాను ఇదివరకు ఎన్నో సినిమాలలో నటించిన రాని గుర్తింపు తనకు జబర్దస్త్ కార్యక్రమం వల్ల వచ్చిందని తెలిపారు.అదిరే అభి చలాకి చంటి వారి వల్లనే నాకు జబర్దస్త్ లో అవకాశం వచ్చిందని, వారి రుణం ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఈ సందర్భంగా నవీన్ మాట్లాడారు.







