టాలీవుడ్ ఇండస్ట్రీలో నెగటివ్ పాత్రలతో అందర్నీ తనవైపుకు మలుపుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్( Varalakshmi Sarath Kumar ).ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ విలన్ పాత్రకు ఈమెను మించిన వాళ్లు లేరని చెప్పాలి.
అతి తక్కువ సమయంలో తన నటనతో ప్రేక్షకులందరిని ఫిదా చేసింది.ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శరత్ కుమార్ ముద్దుల కూతురు.
శరత్ కుమార్ మొదటి భార్యకు వరలక్ష్మి పుట్టింది.ఇప్పుడు శరత్ కుమార్ రెండవ భార్య గా రాధిక( Radhika ) ఉంది.
ఇక రాధిక వరలక్ష్మిని సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది.
వారసత్వంగా వరలక్ష్మి నటిగా అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.తన నటనకు ఉత్తమనటి అవార్డు కూడా సొంతం చేసుకుంది.2012 తమిళ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టి.2019లో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమా( Tenali Ramakrishna BA BL movie )తో టాలీవుడ్ కు పరిచయమైంది.
గతంలో క్రాక్, నాంది సినిమాలో నటించి తన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.
ఇక యశోద సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ నెగటివ్ రోల్ చేసింది.ఇక వీరసింహారెడ్డి సినిమాలో మాత్రం బాలకృష్ణ కు పోటీగా నిలిచింది వరలక్ష్మి శరత్ కుమార్.
ఈ సినిమాలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఏకంగా విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తెలుగు ప్రేక్షకులను కూడా తన ఫాలోవర్స్ గా మార్చుకుంది.అప్పుడప్పుడు తన డాన్స్ వీడియోలతో కూడా బాగా ఫిదా చేస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందరిని బాగా ఆకట్టుకుంటుంది.నిజానికి ఈ బ్యూటీ హీరోయిన్ పీస్ అని చెప్పాలి.కానీ టాలీవుడ్ లో ఈమె మొత్తం విలన్ పాత్రలలోనే నటిస్తుంది.ఇటీవలే కూడా ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా సందడి చేసింది.
ప్రస్తుతం ఈమె ఖాతాలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి.ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫ్యామిలీతో బాగా సందడి చేస్తూ ఉంటుంది.తల్లి రాధికతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా ఒక వీడియో పంచుకుంది.అందులో తన తల్లి, తను తిన్నా రకరకాల ఫుడ్డులకు సంబంధించిన వీడియోలను పంచుకుంది.ఇక అందులో వాళ్ళిద్దరూ రకరకాల ఫుడ్ ఐటమ్స్ తింటూ కనిపించారు.
దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వగా ఆ వీడియో చూసి జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా కామెంట్ చేస్తున్నారు.ఓ నెటిజన్ మాత్రం.మనుషులు లా అసలు తినడం లేదు గా.ఏదో దయ్యం పట్టిన వాళ్లు లా తింటున్నారు అంటూ దారుణంగా ట్రోల్ చేశారు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.