నార్త్ లో హవా చూపిస్తున్న సౌత్ హీరోయిన్స్.. అక్కడోళ్ళను తొక్కేసి మరీ..

ఇప్పుడు ఉన్న కథానాయికల్లో ఈ ఐదుగురు కథానాయికలు అటు ఉత్తరాదిన అవకాశాలు అందుకుంటూనే ఇటు దక్షిణాదిలో కూడా తమ క్రేజ్ ను ఏమాత్రం కోల్పోకుండా అడుగులు ముందుకు వేస్తున్నారు.మరీ ఆ లిష్టు ఒకసారి పరిశీలిస్తే.

 South Indian Actresses That Rule The South Indian Film Industry, South Indian Ac-TeluguStop.com

ఇందులో ముఖ్యంగా ఈ ఐదుగురు పేర్లు వినిపిస్తున్నాయి.వారు సమంత, పూజా హెగ్డే, రష్మిక మందన్న, నయనతార, కీర్తి సురేష్.

ఈ ఐదుగురు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా రాణిస్తూ కోస్తూ వెనకేస్తున్నారు.ప్రెజెంట్ తెలుగులో ఏ భారీ ప్రాజెక్ట్ లో అయినా వీరి పేర్లు పరిశీలించిన తర్వాతనే మిగతా వారికీ అవకాశం వస్తుంది.

సమంత సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.లగే పుష్ప ఐటెం సాంగ్ తో నార్త్ లో కూడా ఒక ఊపు ఊపేసింది అనే చెప్పాలి.

ఇక ఈ ఐటెం సాంగ్ తర్వాత ఈమె తిరుగులేని స్టార్ డమ్ అందుకోవడమే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది.

రష్మిక మందన్న కూడా ఇదే జాబితాలో ఉంది.

ఈమె కూడా పుష్ప సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకుంది.ఆ తర్వాత బాలీవుడ్ లో వరుసపెట్టి ఆఫర్స్ అందుకుంటూ దూసుకు పోతుంది.

ఈమె సౌత్ లో అవకాశాలు అందుకుంటూనే అటు నార్త్ లో సైతం ఏ మాత్రం తగ్గడం లేదు.

Telugu Keerthy Suresh, Nayanathara, Pooja Hegde, Samantha, Indianactresses-Movie

ఇక సౌత్ లో మరో అగ్ర హీరోయిన్ అంటే పూజా హెగ్డే పేరు వినిపిస్తుంది.ఈమె ఇక్కడ స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతూనే నార్త్ లో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇక లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార సైతం మొదటి సారి జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది.

ఎప్పటి నుండో బాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్న ఈమె మాత్రం అంతగా ఇష్టపడలేదు.అయితే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ షారుఖ్ ఖాన్ తో చేస్తున్న జవాన్ సినిమాతో మాత్రం ఈమె ఎంట్రీ ఇస్తుంది.

Telugu Keerthy Suresh, Nayanathara, Pooja Hegde, Samantha, Indianactresses-Movie

కీర్తి సురేష్ కూడా సర్కారు వారి పాట సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.అయితే ఈమెకు బాలీవుడ్ కంటే సౌత్ అంటేనే ఇష్టం.అందుకే అటు వైపుగా ప్రయత్నాలు చేయడం లేదు.కానీ ఫ్యాన్స్ మాత్రం ఈమె ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube