బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.
ఈమె సినిమాలలో హీరోయిన్ గా కంటే ఐటెం సాంగ్స్ ద్వారానే బాగా పాపులారిటీ సంపాదించుకుంది.ఇక తెలుగులో ఎన్టీఆర్ సరసన ఇట్టాగ రెచ్చి పోదాం అంటూ రెచ్చిపోయి చిందులు వేసింది.
ఆ తర్వాత హిందీలో దిల్ బర్ సాంగ్ తో ఒక ఊపు ఊపేసింది ఈ ముద్దుగుమ్మ.ఇది ఇలా ఉంటే తాజాగా నోరా ఫతేహి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే నోరా ఫతేహి తన తొలి సినిమా షూటింగ్లోనే గొడవ పడిందట.అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.2014లో రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమెకు ఒక చేదు సంఘటన ఎదురైందట.
ఈ విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వీడియోలో నోరా ఫతేహి మాట్లాడుతూ.
బంగ్లాదేశ్ సందర్భన్స్ అడవులలో రోడ్ సినిమా షూటింగ్ జరుగుతోంది.

సంస్కారం లేని ఒక నటుడు నాతో అనుచితంగా ప్రవర్తించాడు.వెంటనే నాకు కోపం వచ్చి అతని చెంప పగలగొట్టాను.అతను తిరిగి నన్ను మళ్ళీ కొట్టాడు.
నేను కూడా తిరిగి అతని మళ్లీ కొట్టాను.అప్పుడు అతను నా జుట్టు పట్టుకుని లాగడంతో నేను కూడా అతని జుట్టు పట్టుకుని లాగాను.
సెట్ లో అందరూ చూస్తుండగానే మేమిద్దరం కొట్టేసుకున్నాము.ఇంతలోని డైరెక్టర్ మధ్యలో కలుగజేసుకొని మమ్మల్ని ఆపాడు అని చెప్పుకొచ్చింది నోరా ఫతేహి.
అయితే నోరా ఫతేహి ఏ నటుడిని కొట్టింది ఆ నటుడు ఎవరు అంటూ నెటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు.







