ఆ ఒక్కటి కొనడానికి కూడా డబ్బులు లేవా.. నటిపై షాకింగ్ ట్రోల్స్!

బాలీవుడ్ బ్యూటీ ముద్దుగుమ్మ నోరా ఫతేహి గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నోరా ఫతేహి.2018 లో దిల్బర్ అనే ఒక మ్యూజిక్ వీడియోలో నటించగా ఆ వీడియో విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.ఈమె డాన్స్ కు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా భారీగా అభిమానులు ఉన్నారు.

 Nora Fatehi Gets Trolled Making Guard Lifting Her Saree Details, Nora Fatehi, Se-TeluguStop.com

ఇది ఇలా ఉంటే నోరా ఫతేహి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ తో కుర్రకారుకు అందాలు కనువిందు చేస్తూ ఉంటుంది.ఈమె తనదైన హావాభావాలతో, డ్యాన్స్‌ మూమెంట్స్‌తో కట్టిపడేస్తు ఉంటుంది.

ఇక తెలుగులో టెంపర్‌ సినిమాలో ఇట్టాగే రెచ్చిపోదాం అనే ఐటమ్‌ సాంగ్‌తో టాలీవుడ్‌లో ఎంటరైన ఈ భామ బాహుబలి చిత్రంలో మనోహారి పాటతో పాపులారిటీ దక్కించుకుంది ఈ ముద్దు గుమ్మ.అలాగే హిందీలో దిల్‌బర్‌ సాంగ్‌ కు ఒక ఊపు ఊపేసింది ఈ భామ.ఇది ఇలా ఉంటే తాజాగా ఈమెపై సోషల్ మీడియా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి.తాజాగా ఆమె నెటిజెన్స్ కు కోపం తెప్పించే విధంగా చేసింది.

డ్యాన్స్‌ రియాలిటీ షో అయిన డ్యాన్స్‌ దీవానే జూనియర్స్‌ షోకు నోరా ఫతేహీ జడ్జిగా వ్యవహరిస్తోంది.

ఈ షోలో పాల్గొనేందుకు నోరా చీరలో వచ్చింది.ఆ సమయంలో అక్కడ వర్షం కురుస్తుంది.వర్షంలో కారు దిగబోతుండగా అక్కడ నీటిలో చీర తడిసిపోతుందని భావించి సెక్యూరిటీ గార్డు సహాయం తీసుకుంది.

సెక్యూరిటీ గార్డు ఆమె చీరను పట్టుకోగా నోరా ఫతేహీ కార్‌వ్యాన్‌లోకి వెళ్లిపోయింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.కాగా ఈ వీడియో విషయంలో నోరాను నెటిజన్స్‌ ఒక ఆట ఆడేసుకుంటున్నారు.మరి తన పై జరిగే ట్రోలింగ్స్ పై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube