సినిమా ఇండస్ట్రీలో రాణించాలని చాలామంది ఎన్నో రకాల కలలు కంటూ ఉంటారు.కానీ అది కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది.
మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు రాయించాలి అన్న నిలదొక్కు కోవాలి అన్న చాలా కష్టపడాలి అని చెప్పవచ్చు.ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ( Film Industry )లో హీరోయిన్లకు ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో పడే కష్టాలు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఫస్ట్ సినిమాతో దశ తిరిగితే పర్లేదు కానీ వచ్చీ రాని అవకాశాలతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

పూట గడవని పరిస్థితుల్లో సినిమాలతో పాటు వేరే పనులు చేసుకున్న నటీ మణులు చాలా మంది ఉన్నారు.అలాంటి వారిలో ప్రముఖ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహి( Nora Fatehi ) కూడా ఒకరు.బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు నోరా ఫతేహి సుపరిచితమే.కాగా ఈమె తన కెరీర్ ప్రారంభంలో తీవ్రమైన డబ్బు కష్టాలను ఎదుర్కొందట.డబ్బు కోసం చిన్న చిన్న పనులు ఎన్నో చేశారు.తాజాగా నోరా ఫతేహి తాను ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడుతూ.
నేను ఇప్పుడు సాధించిన అవకాశాలు మొత్తం చాలా చివరగా దక్కినవే.నేను వీటన్నింటికీ సిద్ధమై ఉన్నాను.
అప్పట్లో నేను అందరు అమ్మాయిల్లా పార్టీలకు వెళ్లేదాన్ని కాదు.

అసలు నాకు బాయ్ ఫ్రెండ్ కూడా లేడు.నేను నా గదిలో తలుపులు బిగించుకుని ఉండేదాన్ని.హిందీ భాష( Hindi Language )ను నేర్చుకునే దాన్ని.
టీవీలో షోలు చూస్తూ భాషను ప్రాక్టీస్ చేసేదాన్ని.నేను నా సోదరుడి పెళ్లికి కూడా వెళ్లలేకపోయాను.
చాలా మంది నన్ను నువ్వు ఏమన్నా మరో కత్రినా కైఫ్( Katrina Kaif ) అవుదామని అనుకుంటున్నావా? అని వ్యంగ్యంగా ప్రశ్నించేవారు.నేను నా ఖర్చులకు డబ్బులు సరిపోక హుక్కా సెంటర్ లో కూడా పని చేశాను.
ఆ పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి.అందరి దగ్గరకు వెళ్లి హుక్కా బాటిళ్లు అందించాల్సి వచ్చేది అని తెలిపింది నోరా ఫతేహి.
ఈ ముద్దుగుమ్మ సినిమాలలో హీరోయిన్గా నటించడంతోపాటు తెలుగులో బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్, ఊపిరి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి ప్రేక్షకులకు ఉర్రూతలూగించింది.







