నిర్మాత సురేష్ బాబు( Suresh Babu ) చిన్న కుమారుడు అభిరామ్ ( Abhi Ram ) ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ( Teja ) అహింస ( Ahimsa ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా అభిరామ్ అహింస సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది.ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్లు కూడా పూర్తిగా పడిపోయాయి.
మొత్తానికి ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుందనే చెప్పాలి.ఇండస్ట్రీకి ఎంతో మందిని పరిచయం చేసినటువంటి తేజ అందరికీ మంచి సక్సెస్ అందించారు.

ఇక అభిరామ్ చేసిన ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అందరూ భావించారు.కానీ ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.అయితే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని డైరెక్టర్ తేజ ముందుగానే చెప్పినటువంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సురేష్ బాబు ఈ సినిమా రిజల్ట్ చెప్పేసారని తాజాగా తేజ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా 90% షూటింగ్ పూర్తి జరిగిన తర్వాత ఒకరోజు సురేష్ బాబు గారు తన వద్దకు వచ్చారని తెలిపారు.

తన వద్దకు వచ్చినటువంటి సురేష్ బాబు రషెస్ చూసి బాగా చేయలేదని చెప్పారు.బాగా చేయలేదు కదా ఎందుకు తీశారు ఆపే లేకపోయారా అంటూ తనని ప్రశ్నించారని తేజ తెలిపారు.సురేష్ బాబు ఇలా అనడంతో తాను కూడా మాట్లాడుతూ నేను ఈ సినిమాని డబ్బుల కోసం చేయలేదు.
కేవలం రామానాయుడు( Rama Naidu ) గారికి తన మనవడిని ఇండస్ట్రీకి పరిచయం నేనే చేస్తాను అని ఇచ్చిన మాట కోసమే ఈ సినిమా చేస్తున్నానని తేజ చెప్పడంతో సురేష్ బాబు కూడా ఎమోషనల్ అవుతూ సినిమాని కంటిన్యూ చేయమని చెప్పారు.ఇలా ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని తమకు ముందే తెలుసు అంటూ తేజ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







