తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్ పదవికి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.
ఈ మేరకు మధ్యాహ్నం 12.30 గంటలకు గడ్డం ప్రసాద్ నామినేషన్ వేశారు.ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో పాటు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కేటీఆర్, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు తదితరులు హాజరయ్యారు.కాగా అసెంబ్లీ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ మద్ధతు ఇచ్చింది.
అయితే ఈ ఎన్నికను ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ నిర్వహించనున్నారు.