కె.జి.ఎఫ్ తో నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మన టాలీవుడ్ స్టార్స్ వరుస్ సినిమాలు చేస్తున్నారు.ఇప్పటికే ప్రభాస్ సలార్ చేస్తుండగా లేటెస్ట్ గా దిల్ రాజు ప్రభాస్, ప్రశాంత్ నీల్ తో రావణం అంటూ మరో సినిమా ఉంటుందని షాక్ ఇచ్చాడు.
సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ కన్నడలో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు.మరోపక్క ప్రశాంత్ నీల్ తో ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు.
కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లలేదు.సలార్ తర్వాత తారక్ తోనే ప్రశాంత్ నీల్ సినిమా అనుకుంటుండగా ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మరో సినిమా అనేసరికి ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ తో సినిమా దాదాపు క్యాన్సిల్ అయినట్టే చెప్పుకుంటున్నారు.మరి నిజంగానే ప్రశాంత్ నీల్ తారక్ కాంబో సినిమా అటకెక్కిందా లేదా వారి కమిట్మెంట్ ముగిశాక చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్.
టి.ఆర్ ఊర మాస్ యాటిట్యూడ్ ని చూడాలని తారక్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.మరి అది ఎప్పటికి కుదురుతుందో చూడాలి.