నానికి నో టికెట్ .. ఊహించిందేగా ? 

బెజవాడ టిడిపిలో వివాదాస్పదంగా మారిన ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని వ్యవహారాన్ని టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) తేల్చేశారు.చాలా కాలంగా కేసిన నాని పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అసంతృప్తితో ఉండడమే కాకుండా, బహిరంగంగా తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

 No Ticket For Kesineni Nani What Did Expect, Tdp, Chandrababu, Jagan, Ysrcp, K-TeluguStop.com

స్వయంగా అధినేత చంద్రబాబు విషయంలోనూ నాని వైఖరి వివాదాస్పదం అయింది.దీంతో ప్రత్యామ్నాయంగా నానికి బదులుగా ఆయన తమ్ముడు కేసినేని చిన్నిని టిడిపి అధిష్టానం గత కొంతకాలంగా ప్రోత్సాహిస్తూ వస్తోంది.

ఇక విజయవాడ లోక్ సభ పరిధిలోని టిడిపి నాయకులు కేసినేని నాని( kesineni nani ) వ్యవహారంపై అసంతృప్తితోనే ఉంటున్నారు.అయినా నాని తాను పార్టీ కోసమే పని చేస్తున్నానని, ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు తనను ఎంత బాధ పెడుతున్నా.

మౌనంగానే ఉంటున్నానంటూ సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్నారు.ఇది ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో కేసినేని నానికి టిక్కెట్ ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

Telugu Ap, Buddha Venkanna, Chandrababu, Devadath, Jagan, Kesineni Chinni, Kesin

ఇదే విషయాన్ని పార్టీ నేతలు ద్వారా నానికి సమాచారాన్ని పంపించారు.అంతేకాదు పార్టీ వ్యవహారాల్లో జోక్యం తగ్గించుకోవాలని, సభలకు ,కార్యక్రమాలకు ఇన్చార్జిగా ఎటువంటి బాధ్యత ఇవ్వలేదు కాబట్టి ,ఎటువంటి హడావుడి చేయవద్దని సూచించారు .నాని కూడా స్వయంగా సోషల్ మీడియద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.విజయవాడ( Vijayawada ) నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

రెండోసారి గెలిచాక పార్టీకి ఇబ్బందికరంగా మారారు .వచ్చే ఎన్నికల్లోనూ ఎంపీగా పోటీ చేయాలని నాని ప్రయత్నిస్తున్నారు.

Telugu Ap, Buddha Venkanna, Chandrababu, Devadath, Jagan, Kesineni Chinni, Kesin

తనకు టికెట్ ఇవ్వకపోతే, ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి దింపాలని నాని కోరుతున్నారు .రెండు రోజుల క్రితం తిరువూరులో టిడిపి కార్యాలయంలో చోటు చేసుకున్న వివాదం పార్టీ పరువును బజారును పడడంతో, నాని విషయంలో ఇక ఉపేక్షించకూడదు అని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.అందుకే టికెట్ ఇవ్వడంలేదనే విషయాన్ని చెప్పడంతో పాటు, పార్టీ  కార్యక్రమాలకు సైతం దూరంగా ఉండాలని సూచించారు.ఈ పరిణమాల నేపథ్యంలో నాని టిడిపిలోని కొనసాగుతారా లేక మరో పార్టీలో చేరుతారా అనేది తేలాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube