ఏపీకి ప్రత్యేక హోదా రాదు … రాదు … రాదు.ఈ సంగతి ఎన్నిసార్లు చెప్పాలి? … ఓ బీజేపీ నాయకుడి వీరంగం ఇది.ఈయన సాదా సీదా నాయకుడు కాదు.సిద్ధార్థ నాథ్ సింగ్ అనే ఈ ఉత్తరాది నాయకుడు ఏపీ బీజేపీకి ఇంచార్జి.
శుక్రవారం ఏపీ బిజేపీ కోర్ కమిటీ సమావేశంలో సింగ్ పాల్గొన్నారు.
రాష్ట్ర పార్టీకి ఇంచార్జి కదా.ఇంత పెద్దాయన కనబడితే విలేకరులు ఊరుకుంటారా? ప్రత్యేక హోదా సంగతి ఏమిటి సార్? అని అడిగారు.అంతే … సింగుకు చిర్రెత్తుకొచ్చింది.
ఎన్నిసార్లు చెప్పాలయ్యా హోదా రాదని అని మండిపడటమే కాకుండా చిల్లర రాజకీయాలు మానుకోండి అని సలహా ఇచ్చారు.
ఇప్పటికే పదకొండు రాష్ట్రాలకు హోదా ఉందని, ఎపీని పన్నెండో రాష్ట్రంగా ఆ జాబితాలో చేర్చబోమని చెప్పారు.
ఈ మధ్యనే ఇద్దరు కేంద్ర మంత్రులు హోదా ఇవ్వడంలేదని స్పష్టం చేశారు.అయినా సీఎం హోదా కోసం ధిల్లీ వెళుతున్నానని, దాన్ని సాధిస్తామని చెప్పారు.
ఇంకా ఆశలు పెట్టుకోవడం అవసరమా ?







