జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ ఈమధ్య హీరోగా కూడా తన లక్ టెస్ట్ చేసుకుంటున్నాడు.అంతకుముందు సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా చేసిన ఈ హీరో ఇప్పుడు వాంటెడ్ పండుగాడ్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో సుధీర్ సరసన దీపిక పిల్లి హీరొయిన్ గా నటిస్తుంది.రైటర్ శ్రీధర్ సీపాన డైరెక్ట్ చేసిన ఈ సినిమాని కె.రాధవేంద్ర రావు పర్యవేక్షణ చేశారు.సినిమా ఈ నెల 19న రిలీజ్ అవుతుంది.
ఈ క్రమంలో సుధీర్ తో ఆ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన దీపిక పిల్లి, విష్ణు ప్రియలతో ఒక ఇంటర్వ్యూ చేశారు.ఆ ఇంటర్వ్యూలో ఇద్దరు హీరోయిన్స్ అదే మొన్నటిదాకా యాంకరింగ్ చేసిన దీపిక పిల్లి, విష్ణు ప్రియలు సుధీర్ ని ఆడేసుకున్నారు.
అసలు సుధీర్ ఆ సినిమాలో హీరో అన్న ఆలోచన కూడా లేకుండా ఓ రేంజ్ లో ఆడుకున్నారు.పైకి వారి పంచులకి సుధీర్ కూడా నవ్వుతున్నా సరే లోపల తను ఒక హీరో అయ్యాక కూడా వీళ్లు నా మీద పంచులేస్తున్నారని ఫీల్ అవుతున్నాడని తెలుస్తుంది.
వాంటెడ్ పండుగాడ్ సినిమాలో సునీల్ కూడా నటించారు.హాట్ యాంకర్ అనసూయ కూడా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.







