" నో పోలవరం ".. జగన్ ఆలోచన ఆదేనా ?

ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి.ఏళ్ళు గడుస్తున్న, ప్రభుత్వాలు మారుతున్న ప్రాజెక్ట్ పనులు మాత్రం పూర్తి కావడం లేదు.

చంద్రబాబు హయంలో పోలవరం పనులకు సంబంధించి ఎంతో కొంత సమాచారం ప్రజలకు తెలిసేది.కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ హయంలో అసలు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏం జరుగుతుందో కూడా ఒక మిస్టరీగానే ఉంది.

గతంలో 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన జగన్ సర్కార్.ఆ తరువాత మళ్ళీ 2022 కు వాయిదా వేసింది.

ఇప్పుడేమో అసలు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తమకే క్లారిటీ లేదని ఏకంగా ప్రభుత్వాధికారులే చెబుతున్నారు.

Advertisement

దీంతో జగన్ పోలవరం ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాలని చూస్తున్నారా ? అందుకే ప్రాజెక్ట్ పనులను బహిర్గతం చేయడం లేదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ( N.Chandrababu Naidu )కూడా ఇటీవల ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు.జగన్( CM jagan ) మూర్ఖత్వం వల్లే పోలవరం డయాఫ్రం దెబ్బతినిందని, పోలవరం అపెందుకు జగన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారంటూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దీంతో ప్రస్తుతం పోలవరం విషయంలో జగన్ సర్కార్ వైఖరి చూస్తుంటే నిజమేనేమో అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

ఎందుకంటే ప్రస్తుతం ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ( Ambati Rambabu )పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఆ మద్య చేసిన వ్యాఖ్యాలే ఇందుకు ఉదాహరణ.పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తి కాదని ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేమని తేల్చి చ్బెప్పారాయన.మరో వైపు ఎన్నికలకు ఎంతో సమయం లేదు ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తిగా హోల్డ్ లో పెట్టిన ఆశ్చర్యం లేదనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం.

మరి ఎన్నికల ముందు పోలవరం అంశాన్ని ప్రజల ముందు ఎలా ప్రస్తావిస్తారో చూడాలి.ఎందుకంటే గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేస్తామని కుండబద్దలు కొట్టిన జగన్.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?

ఇప్పుడు మాట తప్పడంతో ఎన్నికల ప్రచారంలో పోలవరం అంశం ఎలా ప్రస్తావిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు