టాలీవుడ్ స్టార్ హీరో ఉదయ్ కిరణ్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఎక్కువగా లవ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలలో నటించి లవర్ బాయ్ గా నిలిచాడు.ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి అడుగుపెట్టి తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా నిలిచాడు.
అంతే కాకుండా ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.ఇదిలా ఉంటే తమిళంలో ప్రయత్నిద్దాం అనుకున్నాడట ఉదయ్ కిరణ్.
‘చిత్రం‘ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా పరిచయం కాగా ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది.ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి సినిమాలలో నటించి ఉత్తమ నటుడు అవార్డు కూడా అందుకున్నాడు.
అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.ఇక 2012లో విషిత కిరణ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.అలా సాఫీగా సాగుతున్న జీవితంలో కొన్ని వ్యక్తిగత కారణాలతో తన కెరీర్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వాటిని తట్టుకోలేక 2014లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.
ఇక ఈయన అభిమానులు ఈ వార్త విని జీర్ణించుకోలేకపోయారు.

ఇక ఆయన మరణంకు ముందు విషిత తనకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చిందట.తన మానసిక స్థితిని మామూలుగా చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేసిందట.కానీ ఉదయ్ కిరణ్ మాత్రం తన కెరీర్ గురించి ఆలోచిస్తూ ఇండస్ట్రీ తన జీవితాన్ని నాశనం చేసిందని ఆలోచిస్తూ మరింత కృంగి పోయేవాడట.
తెలుగు సినిమాలలో ఇక తొక్కేసారు అనుకోని తమిళ సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించడానికి చెన్నైలో ఒక ఫ్లాట్ ను అద్దెకు తీసుకొని రెండు నెలల అడ్వాన్స్ కూడా ఇచ్చార కానీ అక్కడికి వెళ్లే లోపే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని తన భార్య విషిత తెలిపింది.
.