ఆ దేశంలో ఏ ఒక్కరూ క్రెడిట్ కార్డ్స్ వాడరు... విషయం ఏమంటే?

అదేంటి క్రెడిట్ కార్డ్స్( Credit cards ) వాడని దేశమంతా ఒకటి వుంటుందా? అని అనుమానం వస్తుంది కదూ.ఎందుకు రాదు, వస్తుంది.

 No One Uses Credit Cards In That Country What's The Point, No One Uses, Credit C-TeluguStop.com

ఎందుకంటే మన దేశంలో ప్రతి పది మందిలో 5 మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారని ఓ సర్వే.అలాంటిది ఇతర దేశాలు ఏ మాదిరి వాడుతాయో ఇక ఊహించుకోవచ్చు.

అయితే ఈ ప్రపంచంలో అలాంటి క్రెడిట్ కార్డ్స్ వాడని దేశం కూడా వుంది.చేతిలో డబ్బులు లేనపుడు వస్తువులు కొనేందుకూ, కొద్దిపాటి డబ్బులు కావలసి వచ్చినపుడు జనాల అవసరాలు తీర్చేందుకు ఉపయోగపడేదే క్రెడిట్ కార్డ్.

ఇక్కడ అవసరానికి వాడుకున్న ఆ డబ్బును మెల్లగా చెల్లించే వీలు ఉంటుంది.

Telugu Credit Cards, Latest-Latest News - Telugu

అయితే అవసరానికి వాడుకున్నపుడు బాగానే ఉంటుంది గానీ, తిరిగి చెల్లించే విషయంలో మాత్రం మనం అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాము.దాంతో… వడ్డీ విపరీతంగా పడి.క్రెడిట్ కార్డు ఎందుకు వాడామా? అని బాధపడే పరిస్థితి ఇక్కడ చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది.ఐతే.యూరప్‌లో జర్మనీ( Germany in Europe ) పక్కనే ఉన్న నెదర్లాండ్స్( Netherlands ) దేశంలో ప్రజలు క్రెడిట్ కార్డును దాదాపుగా వాడరు.ఆ దేశంలో క్రెడిట్ కార్డులను అనుమతిస్తారు.కానీ అమెరికా లాంటి మిగతా దేశాలతో పోల్చితే.నెదర్లాండ్స్‌లో వాడేవారు చాలా తక్కువ అని తెలుస్తోంది.

Telugu Credit Cards, Latest-Latest News - Telugu

అంతేకాకుండా అక్కడి బ్యాంకులు కూడా వాటిని వాడమని ఎంకరేజ్ చెయ్యవట.సూపర్ కదా… అదే ఇక్కడైతే మనల్ని క్రెడిట్ కార్డు వాడేదాకా వదిలి పెట్టరు.ఒక్కసారి వాడుకున్నాక మనం బ్యాంకులు చుట్టూ తిరగాల్సిందే.

డచ్( Dutch ) (నెదర్లాండ్స్) ప్రజలు ఏది కొన్నా డెబిట్ కార్డు లేదా మనీని ఎక్కువగా వాడుతారు.ఎంతో సంపన్న దేశం అయినప్పటికీ.

నెదర్లాండ్స్ ప్రజలు.అప్పులు చేయడానికి అస్సలు ఇష్టపడరు.

తమకు ఉన్నదానితోనే సరిపెట్టుకుంటారు.నెదర్లాండ్స్‌లో బ్యాంకింగ్ వ్యవస్థ బాగా డెవలప్ అయ్యింది.

నిజంగా అద్భుతం కదూ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube