దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా వెలుగుతున్న శృతిహాసన్ సీనియర్ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఈమె అనగనగా ఒకదీరుడు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ మొదటి సినిమాతోనే డిజాస్టర్ సొంతం చేసుకుంది.
అనంతరం ఈమె నటించిన పలు సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో ఇండస్ట్రీలో ఈమెకు ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు.ఇలా ఇండస్ట్రీలో హిట్టు లేక సతమతమవుతున్న సమయంలో ఈమెకు పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్న శృతిహాసన్ సినీ కెరియర్లో తిరిగి వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ప్రస్తుతం శృతిహాసన్ ఏకంగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
అయితే ఈమె స్టార్ హీరో వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంతో తన తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఉంటాయని పలువురు భావించారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాను సెలబ్రిటీ కిడ్ అయినప్పటికీ తనకు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి మాత్రమే తన తల్లిదండ్రుల పేరు ఉపయోగపడిందని తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అలాగే అవకాశాలు రావడానికి తన తల్లిదండ్రులు ఎవరికి ఫోన్ చేసి రికమండేషన్ చేయలేదని తెలిపారు.

కేవలం సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి మాత్రమే వారి పేర్లు పనికి వస్తాయని ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని నిలదొక్కుకోవాలంటే పూర్తిగా మన టాలెంట్ ఉపయోగించాల్సి ఉంటుందని ఈమె తెలిపారు.ఇలా తాను స్టార్ కిడ్ అయినప్పటికీ కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను.కొందరు ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేశారు.
అయితే తన సొంత టాలెంట్ తో ఎలాంటి రికమండేషన్లు లేకుండా అవమానాలను ఎదుర్కొని ఇండస్ట్రీలో కొనసాగాలని ఈ సందర్భంగా శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం శృతిహాసన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.