టాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో, అందంతో ఎంతో మంది అభిమానుల హృదయాలను దోచుకుంది.
తన అందం తగ్గటు తను కూడా ఎంత హోమ్లీ గా కనిపిస్తుంది.తను మోడలింగ్ రంగం నుండి మంచి గుర్తింపు పొంది ఆ తర్వాతే సినిమా పరిశ్రమకు పరిచయమైంది.
ఇక ఆమె సినిమాలలో ఎంచుకునే పాత్రలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి.కీర్తి సురేష్ తొలిసారిగా 2000 లో బాలనటిగా పైలెట్స్ అనే మలయాళం సినిమా ద్వారా వెండితెర లో అడుగు పెట్టగా.
తరువాత తమిళ సినిమాలలో నటించింది.ఇక 2016లో నేను శైలజ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక ఆమె నటించిన మహానటి సావిత్రి పాత్ర ఎంత ఆకట్టుకుందో చెప్పనవసరమే లేదు.
ఎందుకంటే ఆ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో లీనమైపోయింది.
ఇక ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి.పైగా మంచి అభిమానాన్ని కూడా సంపాదించుకుంది.
మహానటి సినిమా తర్వాత కూడా పని సక్సెస్ లు అందుకుంది ఈ బ్యూటీ.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.కీర్తి సురేష్ లుక్ ఎంతో హోమ్లీగా ఉండేది.అంతేకాకుండా ఎక్కువ ట్రెడిషనల్ లుక్ లోనే కనిపిస్తుండేది.గత కొన్ని రోజుల నుండి గ్లామర్ ను పరిచయం చేసింది కీర్తి.కెరీర్ మొదట్లో అందంగా, బొద్దుగా ఉండేది.కానీ బాగా వర్కౌట్లు చేసి చాలా సన్నబడింది.
నిజానికి బొద్దుగా ఉన్నప్పుడే కీర్తి సురేష్ చాలా అందంగా ఉండేది.ఇక సన్నబడ్డాక మాత్రం బాగా గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.
పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందర్నీ ఆశ్చర్యపడేలా చేసింది.నేను కూడా ఎందులోనూ తక్కువ కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తుంది కీర్తి.
ఇక సన్నబడ్డాక కూడా కీర్తికి బానే అవకాశాలు వస్తున్నాయి.తన అభిమానులు మాత్రం తను సన్నగా ఉండటాన్ని ఊహించలేకపోతున్నారు.
మళ్లీ మునుపటిలా మారు అంటూ బాగా సలహాలు ఇస్తున్నారు.అయితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది.
ఇక అందులో గ్లామర్ లుక్ లో కనిపించింది కీర్తి.అయితే ఆ ఫోటోలను చూసిన తన అభిమానులు లైక్స్ తో పాటు కామెంట్లు పెడుతూ ఉన్నారు.

కానీ ఓ అభిమాని మాత్రం.కీర్తి సురేష్ సన్నగా ఉండడాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నాడు.మేడం కాస్త లావుగా అవ్వండి ఇంకా క్యూట్ గా ఉంటారు అంటూ సలహా ఇచ్చారు.అంటే కీర్తి సురేష్ లావుగా ఉంటేనే అందంగా ఉంటుంది అని అర్థమవుతుంది.
ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.







