ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం( AP Govt ) చదువు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.చదువు విషయంలో కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతూ ఉంది.
ప్రభుత్వ పాఠశాలలో( Govt Schools ) కార్పొరేట్ తరహా విద్య అందిస్తూ ఉంది.మధ్యాహ్న భోజనం పథకం ద్వారా మంచి పోషకహారం అందిస్తూ ఉంది.
ఇదే సమయంలో “అమ్మఒడి”తో పాటు. పిల్లలకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, మూడు జతల యూనిఫామ్ లు కూడా ప్రతి విద్యార్థికి ఇస్తూ ఉంది.
చదువు విషయంలో సీఎం జగన్( CM Jagan ) అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.పరిస్థితి ఇలా ఉండగా తాజాగా ప్రభుత్వ పాఠశాలలలో మొబైల్ ఫోన్ లు నిషేధిస్తూ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకనుండి పాఠశాలలలో మొబైల్ ఫోన్స్( Mobile Phones ) వాడకూడదని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది.విద్యార్థులు ఎవరు పాఠశాలలకు మొబైల్ ఫోన్ లు తీసుకువెళ్లకూడదని పేర్కొంది.ఇదే సమయంలో ఉపాధ్యాయులకు సైతం పలు కండిషన్స్ పెట్టడం జరిగింది.యునెస్కో( UNESCO ) విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేయడం జరిగింది.
ఉపాధ్యాయులు కూడా తమ ఫోన్స్ తరగతి గదిలోకి తీసుకెళ్లకూడదని తెలిపింది.తరగతి గదులలో విద్యాబోధనకు ఎలాంటి ఆటంకం రాకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది.







