ప్రభుత్వాలు ఎన్ని మారినా, విద్యార్థుల కష్టాలు మాత్రం తీరడం లేదు.శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో వంతెనలు, రోడ్డులు మరమ్మతులకు నోచుకోక పోవడంతో విద్యార్థులు వాగులు వంకలు దాటుకుని ప్రాణ భయంతో పాఠశాలకు వెళ్లాల్సిన దుస్థితి కనిపిస్తోంది.
రొళ్ల మండలంHT హళ్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాదాపు 150 మంది విద్యార్థులు ఉన్నారు.ఈ పాఠశాల సమీపంలో ఆర్&బి రోడ్డు నుండి ఉన్నత పాఠశాల కు మధ్యలో పెద్ద వంక ఉంది.
ఈ వంక రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న రోడ్డు తెగిపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు.గత మూడు సంవత్సరాల నుండి ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందించినా స్పందించిన దాఖలాలు లేవు.
దయచేసి ఇప్పటికైనా ఈ విద్యార్థుల కష్టాలను గుర్తించి భారీ వర్షాలు కురిసిన సమయంలో వంకలు వాగులు దాటుకుని పాఠశాలకు వెళ్లే ప్రయాసతో తొందరపడి ప్రమాదవశాత్తు కాలు జారి పడి విద్యార్థులు ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.అధికారులు ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా రోడ్డుకు వంతెన నిర్మించి రోడ్డు మరమ్మతు చేయవలసిందిగా ఉన్నత స్థాయి అధికారులకు పాఠశాల విద్యార్థులు, రాజు, యోగేష్, రాకేష్ , బాబు ఉమేష్ రాము హరీష్ మంతెష్ మహాభాషా హేమరాజ్ ప్రార్థిస్తున్నారు.