అయోమయంలో ఆచార్య.. వచ్చేది ఎప్పుడు చెప్పయ్యా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.అయితే కరోనా కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది.

 No Clarity On Acharya Movie Release Date, Acharya, Chiranjeevi, Koratala Siva, R-TeluguStop.com

ఇప్పటికీ ఈ సినిమాలో ఓ సాంగ్ మినహా షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ అంటోంది.ఈ పాటను కూడా చిత్రీకరిస్తే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతారు.

అయితే ఇప్పటివరకు ఉన్న సమస్యకంటే ఇప్పుడు మరో పెద్ద సమస్య ఆచార్య ముందర నెలకొంది.ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ నానా తంటాలు పడుతున్నారట.

నిజానికి మే 23న ఆచార్య చిత్రాన్ని రిలీజ్ చేస్తామని గతంలో చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.దీంతో ఈ సినిమాను వేసవిలో చూసేద్దామని మెగా ఫ్యాన్స్ రెడీ అయ్యారు.

కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడింది.ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేద్దామా అని చిత్ర యూనిట్ తలలు పట్టుకుంటున్నారట.

అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ అవుతుండటంతో ఆ నెలలో ఆచార్యను రిలీజ్ చేస్తే ఖచ్చితంగా నష్టపోతామని నిర్మాతలు భావిస్తున్నారట.

దీంతో సంక్రాంతి బరిలో రిలీజ్ చేద్దామా అంటే ఇప్పటికే రెండు మూడు బడా చిత్రాలు ఖర్చీఫులు వేసుకుని మరీ రెడీగా ఉన్నాయి.

ఇక చేసేదేమీ లేక ఈ సినిమాను సంక్రాంతి బరి కంటే ముందే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.క్రిస్మస్‌కు పుష్ప రిలీజ్ అవుతుండటంతో, ఆ సినిమా జోరు కాస్త తగ్గగానే ఆచార్యను థియేటర్లలోకి వదలాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

ఏదేమైనా సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు కూడా ఇంతలా కష్టపడని ఆచార్య, రిలీజ్ విషయంలో మాత్రం చాలా కష్టపడుతున్నాడని సినీ విమర్శకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube