ఎన్ని చేసిన ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదు అంటున్న విశ్లేషకులు

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా దారుణమైన పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది.

జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీ అఖండ విజయం సొంతం చేసుకొని అధికారంలోకి వచ్చింది.

దీంతో ఇప్పుడు టిడిపి పార్టీ నేతల్లో ఒక రకమైన నైరాశ్యం ఏర్పడింది.కేవలం 25 స్థానాలకే పరిమితం కావడంతో పాటు చంద్రబాబు తర్వాత టిడిపిని ముందుండి నడిపించే సత్తా ఉన్న నేత లేకపోవడంతో ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు.

ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ లాంటి కీలక నేతలు బిజెపి పార్టీలో చేరిపోయారు.ఇదిలా ఉంటే మరో 15 మంది ఎమ్మెల్యేలు బిజెపి పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు.

ఇలా బిజెపిలోకి చేరబోయే నేతల్లో లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు మరో కీలకమైన నేతలు కూడా ఉన్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి ఇ విదేశాల్లో ఉన్న నేపథ్యంలో లో ఇదే అవకాశంగా చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తుంది.

Advertisement

ఇదిలా ఉంటే ఏపీలో భారతీయ జనతా పార్టీ మరో కీలక అధ్యాయం మొదలు పెడుతుందని, భవిష్యత్తులో బలమైన రాజకీయ శక్తిగా మారుతుందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.అయితే ఎంత మంది టీడీపీ నేతలు బిజెపి లోకి వెళ్ళిన కూడా ఏపీలో బిజెపి బలపడే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

సరైన నాయకత్వం, పార్టీని ముందుండి నడిపించే ఒక మాస్ లీడర్ లేకుండా బిజెపి పార్టీ ఏపీ లో దొరికే అవకాశమే లేదని తేల్చి చెబుతున్నారు.బిజెపి పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్లో ఎదగాలని భావిస్తున్న ప్రజలు మాత్రం ఆ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి కూడా లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు