కరోనాతో దేశం అనేక ఇబ్బందులు పడుతుంది.దీనిని నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోంది.
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి కదా అనుకునేలోపే కరోనా స్ట్రెయిన్‌తో మరొక సమస్య వచ్చిపడింది.ఇది చాలదనకుండా దీనికి తోడూ ఇప్పుడు బర్డ్ ఫ్లూ సమస్య దేశాన్ని పట్టి పీడిస్తున్నది.
దేశంలో బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతోంది.ఏడు రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం తక్కువే బర్డ్‌ఫ్లూ బాధిత రాష్ట్రాల్లో వేలాది పక్షులు మృత్యువాత పడుతున్నాయి.
వలస పక్షుల ద్వారా వ్యాపించిన ఈ వైరస్ ఉత్తరాది రాష్ట్రాలకు పట్టిపీడిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు అన్నిరాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.ముఖ్యంగా కోళ్ల పరిశ్రమ నిర్వాహకులు జాగ్రత్తగా ఉండాలని చూచించింది.
ఈ ప్రభావం కోళ్ల పరిశ్రమపై పడకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి.వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మరోపక్క చికెన్ వ్యాపారస్తుల్లో ఆందోళన మొదలైందిచికెన్ ధరలు ఎక్కడా తగ్గుముఖంపట్టి తమ వ్యాపారాలు లాస్ అవుతాయని భయపడుతున్నారు.చికెన్ వినియోగదారులు చికెన్ తినాలా వద్దా? అని ఆందోళన చెందుతున్నారు.తెలంగాణ కంటే బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ ఏపీ కాస్త ఎక్కువగా ఉంది.దీంతో పక్కనున్న ఏపీలో చికెన్ ధరలు ఇప్పటికే తగ్గుముఖం పట్టాయి.అయితే తెలంగాణలో మాత్రం చికెన్ ధరలు, వినియోగం అంతగా తగ్గలేదు.హైదరాబాద్‌లో ధరలు సాధారణ స్థితిలోనే ఉన్నాయి.ప్రస్తుతం స్కిన్‌లెస్ చికెన్ ధర కేజీ రూ.180 ఉంది.గత వారం రోజులుగా ఈ ధరలే ఉన్నట్లు వ్యాపారస్తులు పేర్కొంటున్నారు.