నాని నటించిన జెంటిల్‌మెన్ చిత్రంతో టాలీవుడ్‌లో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్న మలయాళ బ్యూటీ నివేదా థామస్, ఆ తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వచ్చింది.ఇప్పటికే మంచి నటిగా గుర్తింపును తెచ్చుకున్న ఈ బ్యూటీ, తాజాగా నాని,సుధీర్ బాబులు కలిసి నటిస్తున్న ‘వి’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.
కాగా ఈ సినిమా రిలీజ్ సందర్భంగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
తనకు హీరోయిన్ కంటే కూడా నటనకు ఎక్కవ ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఇష్టమని నివేదా చెప్పుకొచ్చింది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రంలో అమ్మడు కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.అయితే తనకు నటనకు స్కోప్ ఎక్కువగా ఉండే నెగెటివ్ పాత్రలు, విలన్ పాత్రలు చేయాలని ఉందని నివేదా చెప్పుకొచ్చింది.
అటు ఓటీటీ కంటెంట్‌లో దమ్ముంటే తాను అందులో నటించేందుకు ఎప్పుడూ రెడీయే అంటోంది.
మొత్తానికి నివేదా థామస్ హీరోయిన్ కంటే కూడా తనకు పేరు తీసుకొచ్చే పాత్రలు చేసేందుకే ఎక్కవ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ బ్యూటీ ఇటీవల కాలంలో చాలా తక్కువగా సినిమాలను సెలెక్ట్ చేస్తూ, తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే చేస్తోంది.అందంతో పాటు అభినయానికి పెట్టింది పేరుగా నివేదా థామస్ గుర్తింపు తెచ్చుకోవడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరి వకీల్ సాబ్ చిత్రం, వి చిత్రంలో అమ్మడి పాత్ర ఎలా ఉంటుందో తెలియాంటే ఆయా సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.